Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎయిర్ ఇండియాలో 300 ట్రెయినీ క్యాబిన్ క్రూ పోస్టులు
 

భార‌త ప్రభుత్వ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా స‌ద‌ర‌న్ రీజియ‌న్‌లో తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న‌ 300 ట్రెయినీ క్యాబిన్ క్రూ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఉద్యోగంలోకి చేరిన త‌ర్వాత‌ అయిదేళ్లపాటు విధుల్లో కొన‌సాగుతారు. అనంత‌రం అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ వ్యవ‌ధిని పొడిగించ‌వ‌చ్చు. ఎంపికైనవాళ్లు చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, కాలిక‌ట్‌ల్లో ఏదోఒక చోట నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. శిక్షణ స‌మ‌యంలో రూ.15,000, విధుల్లోకి చేరిన త‌ర్వాత రూ.35,000కు పైగా వేత‌న రూపంలో పొంద‌వ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు: 300. వీటిలో పురుషుల‌కు 75, మ‌హిళ‌ల‌కు 225 కేటాయించారు.
కేట‌గిరీల వారీ: పురుషుల పోస్టుల్లో జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు 36, ఓబీసీల‌కు 20, ఎస్సీల‌కు 14, ఎస్టీల‌కు 5 ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు సంబంధించి జ‌న‌ర‌ల్ 107, ఓబీసీ 63, ఎస్సీ 39, ఎస్టీ 16 ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత. అయితే హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ కేట‌రింగ్ టెక్నాల‌జీల్లో మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన‌వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో ప్రావీణ్యం ఉండాలి. అలాగే విదేశీ భాష‌లు వ‌చ్చిన‌వారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు త‌ప్పనిస‌రిగా అవివాహితులై ఉండాలి.
వ‌యోప‌రిమితి: ఆగ‌స్టు 1, 2016 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
శారీర‌క ప్రమాణాలు: మ‌హిళ‌లైతే 160 సెం.మీ, పురుషులు 172 సెం.మీ. ఎత్తు ఉండాలి. మ‌హిళ‌ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18-22, పురుషుల‌కు 18-25 ప‌రిధిలో ఉండాలి. బ‌రువు/ ఎత్తు (మీట‌ర్లలో) X ఎత్తు (మీట‌ర్లలో) గ‌ణిస్తే బీఎంఐ లెక్కించ‌వ‌చ్చు.

ఎంపిక విధానం:
ముందుగా గ్రూప్ డైన‌మిక్ అండ్ ప‌ర్సనాలిటీ అసెస్‌మెంట్ టెస్టు (జీడీ అండ్ పీఏటీ) ఉంటుంది. జీడీ అండ్ పీఏటీ కోసం మ‌హిళ‌లు చీర‌లు, పురుషులైతే ఫార్మల్ దుస్తులు ధ‌రించి హాజ‌రు కావ‌డం త‌ప్పనిస‌రి. ఇందులో అర్హత సాధించిన‌వారికి రాత ప‌రీక్షలు నిర్వహిస్తారు.

ఎంపికైతే
రాత ప‌రీక్షలో ఎంపికైన‌వారికి హైద‌రాబాద్‌, ముంబై లేదా మ‌రేదైనా ప్రాంతంలో శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణా స‌మ‌యంలో నెల‌కు రూ.15,000 చొప్పున చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లోకి చేరిన‌వారికి నెల‌కు రూ. 35075 చెల్లిస్తారు. అభ్యర్థులు అయిదేళ్లపాటు విధుల్లో కొన‌సాగవ‌చ్చు. ఈ వ్యవ‌ధి అనంత‌రం అభ్యర్థి ప‌నితీరు, కంపెనీ అవ‌స‌రాల ప్రాతిప‌దిక‌న మ‌రికొన్నాళ్లు విధుల్లో కొన‌సాగించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అయితే ఎప్పటికీ శాశ్వత ఉద్యోగాలుగా ప‌రిగ‌ణించ‌రు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: ద‌ర‌ఖాస్తు ఫీజుగా అభ్యర్థులు ఎయిర్ ఇండియా, చెన్నై పేరుతో రూ.వెయ్యి డీడీ తీయాలి. ఈ వివ‌రాలు అప్లికేష‌న్‌లో న‌మోదు చేయాలి. జీడీ అండ్ పీఏటీకి హాజ‌రైన‌ప్పుడు డీడీని అంద‌జేయాలి. ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సి అవ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 8

మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌
అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసే ముందు ఎంబీబీఎస్ వైద్యుడి నుంచి ఎత్తు, బ‌రువు, బాడీమాస్ ఇండెక్స్, క‌ల‌ర్ బ్లైండ్‌నెస్‌..త‌దిత‌ర వివ‌రాల‌తో కూడిన మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ పొందాలి. ఈ న‌మూనా మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌ను ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. వైద్యుని పేరు, రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ త‌ప్పనిస‌రిగా స‌ర్టిఫికెట్‌పై ఉండాలి. ఈ వివ‌రాల‌న్నీ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులో న‌మోదుచేయాల్సి ఉంటుంది. జీడీ అండ్ పీఏటీకి హాజ‌రైన‌ప్పుడు ఈ ఒరిజిన‌ల్ మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌ను సమ‌ర్పించాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్: http://www.airindia.in/

నోటిఫికేష‌న్‌

posted on 20-10-2016