వీసా గడువు తీరకముందే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అమెరికా వీసాలపై ఉన్న సందేహాల నివృత్తికి సంబంధించి 'అమెరికా యానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరీనా ధనానా ఇచ్చిన సమాధానాలు |
మీ వీసా గడువు తీరకముందే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ఇంకా ఉన్నా... ఇటీవలే పూర్తయినా వీసా ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత పొందాలి. పూర్తి వివరాలకు http://tinyurl.comhsd9he వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
మీరు ఉద్యోగార్థులుగా ఇమ్మిగ్రేషన్ వీసా కింద అమెరికాకు వలస వెళ్లేందుకు సిద్ధమైతే అందుకు అర్హులో కాదో తెలుసుకునేందుకు http://tinyurl.com/89hqz4s సందర్శించండి. మీకు వర్క్ వీసా కావాలంటే అమెరికాలో అర్హత కలిగిన కంపెనీ మీ సేవలను పొందాలన్న అభ్యర్థన పత్రం మీ వద్ద ఉండాలి. అమెరికాలో చదువుకునే విద్యార్థుల కోసం ఇటీవలే ప్రభుత్వం కొత్త వెబ్‌సైట్‌ను http://educationusa.state.gov/ ప్రారంభించింది. విద్యార్థుల వీసాలను మేం బాగా ప్రోత్సహిస్తున్నాం. ఈ వెబ్‌సైట్ ద్వారా వీసా ప్రక్రియ సులభంగా అర్థమవుతుంది. సాధారణ సమాచారం కోసం FMJVisas@state.gov కి ఈ-మెయిల్ చేయండి. విద్యార్థుల కోసం ఇచ్చే వీసా కేవలం అక్కడ విద్యను అభ్యసించేందుకేనని గుర్తుంచుకోండి. పరిమితులతో కూడిన కొన్నిపనులు చేసేందుకు... అది కూడా వారి విద్యాభ్యాసానికి ఉపకరించే విధంగా ఉండేవాటిని అనుమతిస్తారు.
కొన్ని వీసా దరఖాస్తులకు పరిపాలన సంబంధమైన అంశాల దృష్ట్యా అదనపు సమయం అవసరమౌతుంది. వర్క్ వీసాల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సాధారణంగా వీసా వచ్చేందుకు 60 రోజులు పడుతుంది. పరిపాలనా సంబంధమైన అంశాలున్న పక్షంలో ఆలస్యం అనివార్యం. అందుకే వర్క్ వీసా కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. పరిపాలన సంబంధమైన ప్రక్రియ 90 రోజులు దాటి ఉంటే మీరు infoushyderabad@vfshelpine.com ను సంప్రదించండి.
వీసా దరఖాస్తులను వేగంగా ఇచ్చేందుకు ప్రాంతీయ స్థాయిలో కాన్సులేట్ అధికారులను నియమించాం. వీసా కావాలనుకున్నవారు వారున్న ప్రాంతీయ కాన్సులేట్ కార్యాలయాల్లోనే దరఖాస్తు చేసుకుంటే మంచింది. ఎందుకంటే భాషా సంబంధ ఇబ్బందులు రాకుండా కాన్సులేట్ అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. వీసా కోసం మరో ప్రాంతానికి వెళితే అక్కడున్న వీసా అధికారులు ఇంటర్వ్యూ సమయంలో భాషా సంబంధ ఇబ్బందుల కారణంగా తిరస్కరించే అవకాశం ఉంది. మీ విషయంలో మాత్రం మంబయిలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే... కారణాలను మీరు ఇంటర్వ్యూ అధికారులకు వివరించాల్సి ఉంటుంది. ఇక మీ మార్కుల జాబితా ఇంకా రాలేదన్నారు. అనధికారికంగా ఉన్న కాపీని తీసుకురండి. వచ్చేప్పుడు 7 సెమిస్టర్ల మార్కుల జాబితాను తప్పనిసరిగా తీసుకురావాలి.
మీ మనవరాలిని అమెరికాకు తీసుకెళ్లాలంటే వీసా ఇంటర్వ్యూకు ఆ అమ్మాయితో పాటు మీరు కూడా హాజరుకావాలి. తల్లిదండ్రుల అనుమతి అంటూ ప్రత్యేకించి లేఖ అవసరం లేదు. వారికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ పేర్కొనాలి. అవసరమైన అన్ని పత్రాలను తీసుకురావాలి.