గ్రీన్ కార్డును పునరుద్ధరించుకోవచ్చు గ్రీన్ కార్డును ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. కావాలంటే మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అయితే పునరుద్ధరణలో ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారిలానే ప్రక్రియ ఉంటుంది. గ్రీన్ కార్డును రద్దు చేసుకున్నప్పటికీ సందర్శకుల కోటాలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రద్దు అంశం ఎలాంటి ప్రతిబంధకం కాదు అని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ స్పష్టం చేశారు. |
మీరు వీసా కోసం అవసరమైన ధ్రువపత్రాలను తీసుకురండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
SEVIS ఫీజు చెల్లించిన వెంటనే మీకు ఐ-20 వస్తుంది. మీరు చెల్లించిన ఫీజు మీ చదువు పూర్తయ్యేంత వరకూ వర్తిస్తుంది. ఎలాంటి అదనపు రుసుం కట్టాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు http://www.ice.gov/sevis/i901/faq.htm వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీరు మళ్లీ వీసా కోసం అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకోండి. హెచ్-1బీ వీసా పొందేందుకు అవసరమైన సమాచారం hyderabad.usconsulate.govనాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసా సమాచారం http://travel.state.govలో లభిస్తుంది. మీ అభ్యర్థన గడువు, వీసా గడువు పూర్త్తెన పక్షంలో http://www.uscis.gov/వెబ్‌సైట్‌లో ఉన్న చిరునామాల్లో సంప్రదించండి.
భారతీయ మహిళ భర్త(అమెరికా పౌరుడు) ఐ-130ని ఫైల్ చేయాలి. కే3 వీసా కోసం ముంబయిలోని అమెరికన్ కాన్సులేట్ లేదా ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు http://tinyurl.com/yfd3gnn వెబ్‌సైట్‌ను సందర్శించండి.
గడువు పూర్తయ్యే లోపు వీసా పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్‌లలో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో ఆ దేశం నుంచే వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. వివరాల కోసం http://www.usembassy.gov/వెబ్‌సైట్‌ను చూడండి. ఏయే ధ్రువపత్రాలు అవసరమో అందులో చూసి తెలుసుకోండి.
మీరు బీ1/బీ2 వీసా కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉంది. ఇంటర్వ్యూ సమయంలో మీరు అమెరికాకు వలస వెళ్లడం లేదన్న విషయాన్ని అధికారులకు చెప్పండి. మీ గ్రీన్ కార్డు రద్దు చేసుకోవాలంటే ఐ-407 దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. మీరు గ్రీన్ కార్డు హోదా వదిలేసుకున్నా తదుపరి కావాలని కోరుకున్నా కొత్తగా మీరు తీసుకునే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాపై ఎలాంటి ప్రభావం ఉండదు. వివరాలు http://newdelhi.usembassy.gov/uscisdownloads.htmlవెబ్‌సైట్‌లో లభిస్తాయి.