అమెరికాయానానికి 'ఈనాడు' తోడు ఉన్నత విద్య.. మెరుగైన ఉపాధి అవకాశాలు.. బంధువులను కలవడం.. పర్యాటకం.. ఇలా అనేక అవసరాల నిమిత్తం రాష్ట్రం నుంచి చాలా మంది అమెరికా వెళ్తుంటారు. ఇందుకు వీసా సమకూర్చుకోవడమనేది మహా క్రతువు. దరఖాస్తు చేయడం మొదలు వీసా చేతిలో పడే వరకు ఎన్నో సందేహాలు, మరెన్నో సమస్యలు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే అసలు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' మీకు తోడుగా నిలుస్తుంది. వీసాలకు సంబంధించిన సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారంతోపాటు తగిన సూచనలు ఇచ్చేందుకు అమెరికా కాన్సుల్ జనరల్ కెథరీనా ధనాని సంసిద్ధత వ్యక్తంచేశారు.

ఒకసారి.. ఒకటే వీసా..!

ఒకేదఫా రెండు రకాల వీసాలకు దరఖాస్తు చేయకూడదు. ఏ రకమైన వీసాకు అర్హులన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత అందుకు అనుగుణంగా దరఖాస్తు చేసి ధ్రువపత్రాలను జత చేయాలి. ఒకే వ్యక్తి ఏక కాలంలో రెండు దరఖాస్తులు చేయటానికి అనుమతి లేదు. వీసాకు సంబంధించిన ఫలితం తేలిన తరువాత అర్హత ఉంటే మరో దఫా మరోరకమైన వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాకు ఏ ప్రాతిపదికన వెళ్లాలన్నది ముందుగా నిర్ధరించుకోవాలి. పర్యటకం, ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి ఇలా ఎందుకోసం వెళ్లాలి అనుకుంటున్నది ఖరారు చేసుకున్న తర్వాత వీసా ప్రయత్నాలు చేయటం మంచిది. అన్ని వీసాల అర్హతలు ఒకేలా ఉండవు. మీరు ఎంచుకున్న వీసా, అర్హత ఆధారంగా నియమ నిబంధనలు ఉంటాయని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మరిన్ని వివరాలు

గడువునకు ఆర్నెల్ల ముందే వీసా పునరుద్ధరణ!

హైదరాబాద్‌: గడువు ముగియడానికి ఆరు నెలల ముందు నుంచి ఎప్పుడైనా వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా హోదాలు, పరిస్థితుల ఆధారంగా వివిధ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పునరుద్ధరణ సమయంలో ఇంటర్వ్యూలకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు వెసులుబాటు కూడా ఉంది. వీసా కోసం దరఖాస్తు చేసే సందర్భంలో డి-160 పత్రాన్ని భర్తీ చేసేప్పుడు వ్యక్తిగత, పాస్‌పోర్టు వివరాలు యథాతథంగా నమోదు చేయండి. ఆ రెండింటికీ చిన్నపాటి వ్యత్యాసాలున్నా వీసా తిరస్కరణకు గురవుతుంది. ఉపకార వేతనంతో అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసించేందుకు వెసులుబాటు ఉంది. అయితే కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాజీ ఉండదని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు

పాస్‌పోర్టుకు ఆరునెలల గడువు ఉండాలి

హైదరాబాద్‌: పాస్‌పోర్టులో ఉన్న సమాచారాన్నే వీసా దరఖాస్తులో నమోదు చేయండి. పాస్‌పోర్టులోని వివరాలకు, వీసా దరఖాస్తు వివరాలకు అక్షరాల్లో మార్పు ఉండకూడదు. పెళ్లి తర్వాత మహిళల ఇంటిపేర్లు, తండ్రి పేరు స్థానంలో భర్త పేరును చేరుస్తుంటారు. ఈ మార్పుల సమాచారం పాస్‌పోర్టులో ఉంటేనే నమోదు చేయండి. ఆయా వివరాలతోనే వీసా కావాలనుకుంటే ముందుగా పాస్‌పోర్టులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు వివరాలే వీసా దరఖాస్తుకు ప్రామాణికం. అర్హమైన వీసా ఉన్నప్పటికీ కనీసం ఆరు నెలలపాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఉండాలి. ఆ గడువు లేని పక్షంలో మరో పాస్‌పోర్టును పొందిన తర్వాతే అమెరికా వెళ్లడం మంచిదని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ చెప్పారు. 'అమెరికా యానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఆ వివరాలు. మరిన్ని వివరాలు

వీసా గడువు ముగిశాకే కొత్త విధానం

హైదరాబాద్‌: మంజూరు చేసిన వీసా గడువు తీరే లోపు అమెరికా ప్రభుత్వం వీసా జారీలో చేసే మార్పులు దానిపై ప్రభావం చూపవు. ఇటీవల వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేలిముద్రల నమూనాలు సేకరించే నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ విధానానికి ముందే వీసా జారీ అయితే వేలిముద్రల విధానం వర్తించదు. మంజూరు చేసిన వీసా గడువు తీరి మరో దఫా దరఖాస్తు చేసుకున్న పక్షంలో వేలిముద్రల విధానాన్ని తప్పక అమలు చేస్తారు. భద్రతా చర్యల్లో భాగంగా నిబంధనల్లో మార్పులు చేసినా, అది అందరికీ అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తే ఆ సమాచారాన్ని వీసా తీసుకున్న వారికి ప్రత్యేకంగా అందజేస్తారని హైదరాబాద్‌లోని ఆమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు

అప్పటికల్లా తగిన విద్యార్హతలుండాలి!

హైదరాబాద్‌: అమెరికాలోని విశ్వవిద్యాలయంలో ప్రవేశ సమయానికి నిర్ధారిత అర్హతలు ఉన్నాయా? లేదా? అన్నదే ప్రామాణికం. వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు సప్లిమెంటరీ పరీక్షలు అడ్డంకి కాదు. ఉన్నత చదువులకు అవసరమైన ఖర్చులను ఎలా సమకూర్చుకుంటారు? ఉన్నత విద్య అనంతరం మాతృదేశంలో ఏం చేయాలనుకుంటున్నారు తదితర అంశాలను ఇంటర్వ్యూ అధికారి పరిశీలిస్తారు. మీ సమాధానాల్లో అంకితభావం, నిజాయతీని పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్‌ 1బి వీసా గడువు తీరిన తర్వాత కూడా అమెరికాలో నివసించే పక్షంలో మాతృదేశానికి వచ్చి ఆ తర్వాత మరోదఫా అదే వీసా కోసం దరఖాస్తు చేస్తే మునుపటి అంశాలను స్పష్టంగా చెప్పాలి. అందుకు సంబంధించిన రుజువులను కూడా సమర్పిస్తే మీ అభిప్రాయానికి బలం చేకూరుతుందని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు

అక్షరాలు మారితే అమెరికా వెళ్లలేమా?

హైదరాబాద్‌: పాస్‌పోర్టు, వీసాల్లోని ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఫొటో నలిగినా, స్పష్టంగా కనిపించకపోయినా వలసల విభాగం అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఆయా దేశాల్లోకి వెళ్లేందుకు సైతం అనుమతించరు. ఫొటో స్పష్టంగా కనిపించనంతగా దెబ్బతిన్న పక్షంలో తాజా వీసా? పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడమే మంచిది. హెచ్‌1-బీ హోదాలో నిర్ధరించిన తేదీ కన్నా ఐ-94, ఐ-797ల్లో పేర్కొన్న వీసా గడువులను ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఉంటున్న వారు తమ వారికి వీసా కోసం అవసరమైన, కచ్చితమైన పత్రాలు పంపితే చాలు. ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తారని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథిరిన్‌ ధనానీ చెప్పారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు

తప్పుడు ధ్రువపత్రాలిస్తే ప్రమాదమే!

హైదరాబాద్‌: ఒకదఫా వీసా తిరస్కరించిన నేపథ్యంలో మరోసారి దరఖాస్తు చేసుకుంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది చెప్పడం కష్టమే. గతంలో దరఖాస్తును తిరస్కరించడానికి గల కారణాలు ఏమిటన్నది మాత్రం పరిశీలిస్తారు. దరఖాస్తు నింపే సందర్భంలో, ఇంటర్వ్యూ సమయంలో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. వీసా కోసం అడ్డదారులు తొక్కవద్దు. తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన పక్షంలో ఏదో ఒక సందర్భంలో అవి వెలుగులోకి వస్తే ప్రమాదమే. వీసా గడువు ముగియడానికి కనీసం ఏడాది ముందుగా దరఖాస్తు చేసుకుంటే పర్యటనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. హడావుడి పడాల్సిన పరిస్థితి ఉండదని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ చెప్పారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలిచ్చారు. మరిన్ని వివరాలు

పర్యాటక వీసాలకు విద్యార్హతలతో పనిలేదు

హైదరాబాద్‌: అమెరికా వెళ్లేందుకు పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసే వారికి విద్యార్హత ధ్రువపత్రాలతో పని లేదు. వెళ్లేందుకు గల సహేతుక కారణాలు చూపించాలి. పర్యాటకునిగా వెళ్లి గడువు ముగిసిన తర్వాత భారత్‌కు తిరిగొస్తామనేందుకు అవసరమైన వివరాలు, కారణాలను చూపించడం అనివార్యం. ఆయా కారణాలను ఇంటర్వ్యూ అధికారి విశ్వసించినప్పుడే వీసా మంజూరు చేస్తారు. వలస వీసా అంశాలను ప్రస్తుతానికి హైదరాబాద్‌లో పర్యవేక్షించడం లేదు. ముంబయి కాన్సులేట్‌ కేంద్రంగానే సాగుతున్నాయని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ ధనాని చెప్పారు. వీసా అంశాలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు

ఆ వీసాకు 120 రోజుల్లోపే దరఖాస్తు చేయాలి!

హైదరాబాద్‌: ''విశ్వవిద్యాలయం ద్వారా ఐ-20 వచ్చిన నాటి నుంచి కనీసం నాలుగు నెలల లోపే ఉన్నత విద్య వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా కోసం దరఖాస్తు చేసే నాటికి మీ దగ్గర అందుబాటులో ఉన్న ధ్రువపత్రాలు, మార్కుల జాబితాల వివరాలను మాత్రమే అందులో నమోదు చేయండి. దరఖాస్తులో ఏయే అంశాలు నమోదు చేశారో? వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకు అనుగుణంగానే మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వీసా కోసం తప్పుడు సమాచారం నమోదు చేయవద్దు. ఉన్నది ఉన్నట్లుగా వివరించండి'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టంచేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. వాటిలో కొన్ని. మరిన్ని వివరాలు

వీసాకు బృంద దరఖాస్తు కుదరదు!

''అమెరికా వీసా స్టాంపింగ్‌ ఉన్న పాస్‌పోర్టు పోగొట్టుకున్న పక్షంలో వీసా కోసం మరో దఫా దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. వీరికి దరఖాస్తు నుంచి ఇంటర్వ్యూ వరకు ఎలాంటి అదనపు ప్రాధాన్యం ఉండదు. ఇంటర్వ్యూ అధికారుల ప్రశ్నలకు ఎంత మేర మీరు కచ్చితమైన సమాధానాలు ఇస్తారన్న అంశంపైనే వీసా కేటాయింపు ఆధారపడి ఉంటుంది'' అని హైదరాబాద్‌లోని ఆమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనాని స్పష్టంచేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.మరిన్ని వివరాలు

వీసా గడువు మించితే ఇబ్బందే!

హైదరాబాద్‌: 'అమెరికాలోని అంతర్గత భద్రత (హోంల్యాండ్‌) అధికారుల అనుమతి లేకుండా వీసా గడువు దాటిపోయాక అక్కడ ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పక్షంలో సంబంధిత సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తే వారు ధ్రువీకరించుకుంటారు. ఎలాంటి అనుమతి లేకుండా ఉంటే మరో దఫా అమెరికా వెళ్లే విషయంలో ఆ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ చెప్పారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' పాఠకుల నుంచి ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలిచ్చారు.మరిన్ని వివరాలు

వీసా ముఖాముఖి ఓ సుహృద్భావ ప్రక్రియ

''వీసా ఇంటర్వ్యూల కోసం కన్సల్టెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకోసం అమెరికా వెళ్లాలనుకుంటున్నదే ప్రధానం. ముఖాముఖిలో ఆయా విషయాలను స్పష్టంగా చెప్పగలిగితే చాలు. అది సుహృద్భావ వాతావరణంలో సాగే ప్రక్రియ మాత్రమే. కన్సల్టెంట్ల ఉచ్చులో పడి మోసపోవద్దు. కొంతమంది నిజమైన కన్సల్టెంట్లు ఉంటారు. వారి నుంచి మెరుగైన సలహాలు లభిస్తాయనటంలో సందేహం లేదు'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ చెప్పారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు.మరిన్ని వివరాలు

అన్నదమ్ములు అమెరికాలో ఉన్నా వీసాకు అర్హులే

హైదరాబాద్‌: ''విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలనుకునేవారి సోదరులు ఇప్పటికే అక్కడ పనిచేస్తుంటే.. సదరు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా వీసా రాదన్నది అపోహ మాత్రమే. దరఖాస్తుదారుడి గుణగణాలు, విద్యా ప్రమాణాలు.. నిర్దేశిత ప్రమాణాలకు సరిపోతే వీసా మంజూరవుతుంది'' అని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనాని చెప్పారు. 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు.మరిన్ని వివరాలు

వీసా హోదానే ప్రామాణికం

అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథిరిన్‌ ధనాని

హైదరాబాద్‌: అమెరికా ప్రభుత్వం ఒక పౌరసత్వ హోదా ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న హోదాకు విలువ ఉండదు. ఆ పౌరులకు రెండు హోదాలు ఉన్నట్లు కాదు. తాజాగా ఇచ్చిన హోదాయే అమలులో ఉంటుంది. వీసా జారీ చేస్తే దాని ప్రకారం లభించే హోదా మళ్లీ వీసా మారేంత వరకు అమల్లో ఉంటుంది. కొత్త హోదా లభించిన తరువాత అమెరికా నుంచి తొలిసారి విదేశాలకు వెళ్లేప్పుడు మాత్రం తాజాగా లభించిన హోదా లేదా వీసాకు సంబంధించిన దరఖాస్తును పూర్తి చేయాలి. లేదంటే మళ్లీ అమెరికా వచ్చేప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథిరిన్‌ ధనాని చెప్పారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' పాఠకుల నుంచి ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు.మరిన్ని వివరాలు

ఏ వీసా కావాలో స్పష్టత ఉండాలి!

హైదరాబాద్‌: వీసా కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. విద్యార్థులైతే ఎఫ్‌-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. పర్యాటకం కోసం బి-1, బి-2 వీసాలు తీసుకోవాలి. ఉద్యోగం కోసం వెళుతున్నట్లయితే అమెరికాలో మీకు ఉద్యోగం కల్పిస్తున్న సంస్థ సంబంధిత ధ్రువపత్రాలను అమెరికా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఎలాంటి అర్హతలు లేకుండా హెచ్‌ బి-1 వీసా కోసమో మరొకటి కోసమో దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం ఉండదు. ఎందుకు అమెరికా వెళుతున్నారు? మీ దగ్గర ఉన్న అర్హతలు ఏమిటి? అవన్నీ సక్రమమని భావిస్తేనే ముఖాముఖి అధికారి వీసా మంజూరు చేస్తారు. వీసా పొందేందుకు సమర్పించిన సమాచారంలో లోపాలున్నట్టు గుర్తించిన పక్షంలో అమెరికాలోని విమానాశ్రయంలో దిగిన వెంటనే వెనక్కు పంపే అధికారం అక్కడి ప్రభుత్వానికి ఉంది. అందువల్ల వీసా దరఖాస్తులో కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. వీసా ఇబ్బందులపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు.మరిన్ని వివరాలు

అమెరికా పాస్‌పోర్టును ఇక్కడే పునరుద్ధరించుకోవచ్చు

హైదరాబాద్‌: అమెరికా పాస్‌పోర్టు ఉన్న భారతీయులు వాటిని ఇక్కడ కూడా పునరుద్ధరించుకునేందుకు (రెన్యువల్‌) అవకాశం ఉంది. భారత పర్యటనకు వచ్చిన సందర్భాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కాన్సులేట్‌ జనరల్‌, రాయబార కార్యాలయాల్లో పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా వీసా ఉన్న పక్షంలో ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా అమెరికా వెళ్లేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. నిర్ధారిత కాలపరిమితితో కూడిన వీసా ఉండాలన్నది ప్రధాన నిబంధన. అక్కడి చట్టాలకు లోబడి ఉండాలన్నది మరో నిబంధన. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ ఈ విషయాలను స్పష్టం చేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలిచ్చారు.మరిన్ని వివరాలు

ఉద్యోగం కోల్పోతే వీసా లేనట్లే!

హైదరాబాద్‌: అమెరికాలో ఉద్యోగం చేస్తూ సెలవుపై భారత్‌ వచ్చాక ఉద్యోగం కోల్పోయిన పక్షంలో ఆ వీసాకు విలువ ఉండదు. వీసా గడువు ఉంది కదా... అని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలోనే ఉంటూ ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ నుంచి మరో కంపెనీకి మారిన పక్షంలో పరిస్థితి ఇలా ఉండదు. స్వదేశంలోనే ఉంటూ మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్న పక్షంలో మళ్లీ ఆ వీసా అమలులోకి వస్తుంది. నూతనంగా ఉద్యోగాన్ని పొందిన కంపెనీ నుంచి ధ్రువపత్రాలను అందచేయాల్సి ఉంటుందని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. వీసా సమస్యలపై 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలపై సందేహాలను ఆమె నివృతి చేశారు.మరిన్ని వివరాలు

తెలుగులోనూ వీసా ముఖాముఖి

హైదరాబాద్‌: ''అమెరికా వీసా కోసం ముఖాముఖికి వచ్చే వారు ఆంగ్లంలోనే మాట్లాడాలన్న నిబంధన ఏదీ లేదు. ఆంగ్లం కాకుండా తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, తమిళ భాషల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఆయా భాషల అధికారులు అందుబాటులో ఉన్నారు. ఇవి కాకుండా ఇతర భాషల్లో ఇంటర్వ్యూ కోరుకున్న పక్షంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం. వీసా కోసం భాష సమస్య కానేకాదు'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ చెప్పారు. అమెరికా వీసాలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు.మరిన్ని వివరాలు

ముఖాముఖి సరళమే

* వీసా ప్రక్రియలో ముందస్తుగా వేలిముద్రలు ఇవ్వాలి
* 14 ఏళ్ల లోపు, 79 ఏళ్లు దాటితే వద్దు
* అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ వెల్లడి
''వీసా దరఖాస్తు ముఖాముఖి సరళతరం చేశాం. అంతా సులువుగానే సాగుతుంది. ముఖాముఖికి 14 రోజుల ముందుగా వేలిముద్రలను నమోదు చేసుకోవాలి. కాన్సులేట్‌కు వచ్చే సమయంలో ఏయే పత్రాలు తీసుకెళ్లాలన్న ఆందోళన వద్దు. కంగారులో కొన్నింటిని మర్చిపోయే ప్రమాదం ఉంది. వీసా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన కొత్త విధానంలో భాగంగా ముందుస్తుగా వేలి ముద్రల నమోదును ప్రవేశపెట్టాం. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాం. ముఖాముఖి రోజు మీరు అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొస్తే చాలు'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు

సమాచార సేకరణకే ముఖాముఖి

* వీసాకు అర్హులో కాదో నిర్ధరణ
* రహస్యాలేమీ ఉండవు
* వాస్తవాలనే తెలపాలి
హైదరాబాద్: 'అమెరికా వెళ్లడానికి వీసాను జారీ చేసేముందు దరఖాస్తుదారులు కాన్సులేట్ కార్యాలయంలో ముఖాముఖికి హాజరవ్వాలి. ఈ ప్రక్రియ ముక్కుసూటిగా ఉంటుంది. ఇందులో అధికారులు దరఖాస్తుదారులను ప్రశ్నలడిగేది వారి వద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించేందుకు మాత్రమే. దరఖాస్తుదారులు అమెరికాకు వెళ్లేందుకు వారు ఏ విధంగానూ అభ్యంతరం చెప్పరు. అభ్యర్థి గుణగణాలు, విషయ పరిజ్ఞానం, ఇతర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే వీసా ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. ముఖాముఖీకి హాజరైన వారిలో కొందరు తమకు వీసా తిరస్కరించారు... మరిన్ని వివరాలు

వీసాల జారీలో మినహాయింపులుండవ్‌

80 ఏళ్లు దాటిన వయోధికులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉండదు
హైదరాబాద్‌: ''ఏజెన్సీలు, కన్సల్టెన్సీలపై అమెరికా ప్రభుత్వం ఆధారపడదు. ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వమే ఆహ్వానాలు పలుకుతుంది. కన్సల్టెన్సీలు అసలైనవా? నకిలీవా? అన్నది కూడా ప్రభుత్వానికి అనవసరం. ఈబీ-2 వీసా కోరుకునే వారికి, చేరే సంస్థకు అత్యున్నత ప్రమాణాలు ఉండాలి. ఎలాంటి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా చట్టబద్ధంగా చేసుకోండి. అనుమానాలు నివృత్తికి నేరుగా కాన్సులేట్‌నే సంప్రదించడం మంచిది''అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టంచేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానలు ఇచ్చారు. వాటిలో కొన్ని. మరిన్ని వివరాలు

ఉన్నత ప్రమాణాలుంటేనే ఈబీ-2 వీసా
హైదరాబాద్‌: ''ఏజెన్సీలు, కన్సల్టెన్సీలపై అమెరికా ప్రభుత్వం ఆధారపడదు. ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వమే ఆహ్వానాలు పలుకుతుంది. కన్సల్టెన్సీలు అసలైనవా? నకిలీవా? అన్నది కూడా ప్రభుత్వానికి అనవసరం. ఈబీ-2 వీసా కోరుకునే వారికి, చేరే సంస్థకు అత్యున్నత ప్రమాణాలు ఉండాలి. ఎలాంటి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా చట్టబద్ధంగా చేసుకోండి. అనుమానాలు నివృత్తికి నేరుగా కాన్సులేట్‌నే సంప్రదించడం మంచిది''అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టంచేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానలు ఇచ్చారు. వాటిలో కొన్ని. మరిన్ని వివరాలు
అర్హులందరికీ వీసాలిస్తాం
''అమెరికా వెళ్లాలనుకునే వారిలో అర్హులైన వారందరికీ వీసాలిస్తాం. సహేతుక కారణాలు లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారనేవి దరఖాస్తుదారుల అపోహలు మాత్రమే. దేశవ్యాప్తంగా గతేడాది ఏడు లక్షల నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలు జారీ చేశాం. 6.60 లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్లారు. ఇదో సరికొత్త రికార్డు'' అని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనాని తెలిపారు. 'అమెరికాయానం' పేరుతో 'ఈనాడు' నిర్వహిస్తున్న శీర్షికకు తరచూ వీసా తిరస్కరణ అంశంపై సందేహాలొస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. మరిన్ని వివరాలు
వర్సిటీ మారితే మరోసారి వీసా!
''ఏ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఎఫ్‌1 వీసాను తీసుకున్నారో అదే వర్సిటీకి మాత్రమే ఆ వీసా చెల్లుబాటవుతుంది. మరో విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్న పక్షంలో వీసా కోసం మరో దఫా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఏయే కారణాలతో వర్సిటీని మార్చుకున్నారో ఇంటర్వ్యూ అధికారికి వివరించాల్సి ఉంటుంది. మీరు చెప్పే కారణాలు ఆమోదయోగ్యం కాకపోతే తిరస్కరించే అవకాశమూ లేకపోలేదు''అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ వెల్లడించారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. వాటిలో కొన్ని. మరిన్ని వివరాలు
కుటుంబ సభ్యులకే 'ఆధార' వీసా!
హైదరాబాద్‌: అమెరికాలో హెచ్‌-1బి వీసాపై ఉంటున్న వారి కుటుంబ సభ్యులు మాత్రమే డిపెండెంట్‌ వీసా పొందేందుకు అర్హులు. తల్లిదండ్రులు, అత్తమామలు ఈ వీసాకు అర్హులు కారు. కేవలం వీసాదారుడి భార్య, పిల్లలకు మాత్రమే డిపెండెంట్‌ వీసాను అమెరికా ప్రభుత్వం కేటాయిస్తుంది. వీసా గడువు ముగిసేలోపు ఎన్నిసార్త్లెనా అమెరికా వెళ్లేందుకు ఇబ్బందులు ఉండవు. పరిమిత సంఖ్యలోనే వెళ్లాలన్న ఆంక్షలూ లేవు. భవిష్యత్తు రాకపోకలపై అక్కడి సరిహద్దు భద్రతా అధికారుల ఆంక్షలు, నిషేధం విధించిన సందర్భాల్లోనే అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు స్వేచ్ఛగా ఎన్ని దఫాలైనా రాకపోకలు సాగించవచ్చు అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టంచేశారు. 'అమెరికాయానం' పేరిటవీసా సమస్యలపై 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు అమె సమాధానాలు చెప్పారు. ఈవారం కొన్ని... మరిన్ని వివరాలు
ఎక్కడైనా ఇంటర్వ్యూకు వెళ్లొచ్చు!
''పర్యాటక వీసా కోసం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూకూ హాజరు కావచ్చు. మీరు ఏ దేశంలో ఉంటున్నారో? అక్కడి అమెరికన్‌ కాన్సులేట్‌లోనూ ఇంటర్వ్యూ కోరుకోవచ్చు. దరఖాస్తు సందర్భంలోనే ఇంటర్వ్యూ ఎక్కడ హాజరు కాదలచుకున్నారన్న విషయంలో స్పష్టత ఉండేలా చూసుకోవాలి'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ చెప్పారు. అమెరికా వీసా పొందటంలో ఎదురయ్యే ఇబ్బందుల నివృత్తి కోసం 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు
ఆ దరఖాస్తు భారత్‌లోనే చేయాలి!
హైదరాబాద్‌: ''అమెరికాలో చదువు పూర్తయ్యేలోపే వీసా గడువు ముగుస్తుంటే విధిగా స్వదేశానికి వచ్చి మరో దఫా ఇక్కడే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా గడువు.. జారీ చేసిన తేదీ నుంచి అమలులోకి వస్తుంది'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టంచేశారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. వాటిలో కొన్ని... మరిన్ని వివరాలు
అక్రమ మార్గాల్లో వీసా వద్దు!
హైదరాబాద్‌: ''వీసా కోసం అక్రమ మార్గాలు ఎంచుకొని అవస్థలు కొనితెచ్చుకోవద్దు. వీసా ఇచ్చే ముందు, ఆ తర్వాత కూడా తనిఖీలు, పరిశీలనలు ఉంటాయి. అమెరికన్‌ కాన్సులేట్‌ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఏ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారో? అది ఎందుకన్నది ఇంటర్య్యూ అధికారికి స్పష్టంగా వివరించండి'' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ తెలిపారు. వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. వాటిలో కొన్ని... మరిన్ని వివరాలు
అనుమతి పొందే వరకు అమెరికాలోనే!
అమెరికాకు వలస వెళ్లి స్థిరపడే విదేశీయులకు గ్రీన్‌కార్డు ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ అంత సులభం కాదు. భారతీయులు సహా విదేశీయులు ఎవరైనాసరే.. వారి అర్హతలు, జీవనవిధానాన్ని పరిశీలించిన అనంతరం హోంలాండ్‌ భద్రతా విభాగం సిఫారసు చేస్తేనే గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ సంవత్సరం లోపు పూర్తవ్వచ్చు. లేదంటే సంవత్సరాలు పట్టొచ్చు. దరఖాస్తు పరిశీలనలో ఉండగా అనుమతి పొందేవరకు పరిమితకాలానికి స్వదేశానికి వెళతానంటే నిబంధనలు అంగీకరించవు అంటున్నారు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ. 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' పాఠకుల సందేహాలకు ఆమె సమాధానాలు చెప్పారు. మరిన్ని వివరాలు
వీసా పొందేందుకు వయసుతో పని లేదు
'అమెరికా వీసా పొందేందుకు వయసుకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు. పుట్టిన బిడ్డ మొదలు పండు ముదుసలి వరకూ ఎవరైనా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా వెళ్లేందుకు కారణాలతోపాటు తిరిగి వచ్చేందుకు నిర్ధేశించుకున్న గడువు విషయంలో స్పష్టత ఉండాలి. వీసా పొందిన మీరు తిరిగి భారతదేశానికి వస్తామన్న విషయాన్ని రుజువు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మూలాలు ఎంత బలమైనవో ఇంటర్వ్యూ అధికారికి వివరించాలి. ఒక దఫా వీసా వస్తే గడువు తీరేలోగా ఎన్ని దఫాలైనా వెళ్లి రావచ్చు. వీసా తీసుకుని ఒక్కసారైనా వెళ్లలేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. గడువు తీరిన తర్వాత మరో దఫా వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకమూ ఉండదు.' అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టం చేశారు. 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని.. మరిన్ని వివరాలు
వాళ్లు చివరి రోజైనా అమెరికాలో ఉండాలి!
ఈనాడు : గ్రీన్‌కార్డుదారులు ఏడాదిలో ఒక్క రోజైనా అమెరికాలో ఉండాల్సిందే. కనీసం ఏడాదిలో చివరి రోజైనా తప్పని సరిగా అమెరికాలో ఉండి తీరాల్సిందేనన్న నిబంధన ఉంది. దీన్ని అతిక్రమించిన పక్షంలో గ్రీన్‌కార్డు హోదాకు ప్రమాదకరమేనని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ ధనానీ స్పష్టంచేశారు. అమెరికా వీసా వ్యవహారాలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. వాటిలో కొన్ని... మరిన్ని వివరాలు
తేదీ మారితే దరఖాస్తు చేసుకోవాల్సిందే!
వీసాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత పర్యటన తేదీల్లో మార్పులకు అవకాశం లేదు. మార్చాలంటే మరోదఫా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ సందర్భంగా తేదీల మార్పునకు సంబంధించిన బలమైన కారణాలను ఇంటర్వ్యూ అధికారికి వివరించాల్సి ఉంటుంది. గడువు పూర్తయిన వీసాలను పునరుద్ధరించుకునేందుకు అదనపు ధ్రువపత్రాలు, నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ చెప్పారు. అమెరికా వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు ఆమె సమాధానాలు చెప్పారు. వాటిల్లో కొన్ని.. మరిన్ని వివరాలు
వారం రోజుల్లో అమెరికా వీసా
నేటి నుంచి సరికొత్త ప్రక్రియ ప్రారంభం
తెలుగులోనూ సమాధానాలు, సూచనలు
వెబ్‌సైట్ ద్వారా నేరుగా సంభాషణ

హైదరాబాద్ : అమెరికా వెళ్లే విద్యార్థులు... పర్యాటకులు... వ్యాపారవేత్తలు... అన్ని రంగాల వారికి శుభవార్త. ఇకపై వీరందరికి వారం రోజుల్లోనే వీసా ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీసా దరఖాస్తు నుంచి ఇంటర్వ్యూ వరకూ దరఖాస్తుదారులు వారి సందేహాలను కాన్సులేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అక్కడి అధికారులతో ఎంచక్కా తెలుగులోనే మాట్లాడవచ్చు. అంతేకాదు... అంతర్జాల(ఇంటర్నెట్) పరిజ్ఞానం ఉన్నవారు వెబ్‌సైట్ ద్వారా కాల్‌సెంటర్‌లో విధులు నిర్వహించే వారితో నేరుగా మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. దేశం మొత్తం మీద రెండు కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో ఉండడం తెలుగువారికి ఎంతో ఉపయోగకరం. ఈ కొత్త ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సమగ్ర సమచారం కోసం యూఎస్ కాన్సులేట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కొత్తగా ప్రారంభం కానున్న ప్రక్రియ తెలుగు ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. మరిన్ని వివరాలు
వక్రమార్గాల్లో వీసాతో అవస్థలు తప్పవు
''వీసా పొందాలన్న ఉత్సాహంలో నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసినా, ఇతర వక్రమార్గాల్లో ప్రయత్నించినా.. అవస్థలు తప్పవు. తాత్కాలికంగా వీసాను పొందినా ఆ తర్వాత విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిర్ధారిత గడువు తర్వాత అమెరికాలో ఉండేందుకు ప్రయత్నాలు చేయకండి. ఏదోఒక సందర్భంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తిస్తారు. ఒక దఫా వీసా జారీ చేసిన తరువాత కూడా వివిధ దశల్లో పరిశీలనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఒకింత ఆలస్యమైనా నిజాయతీతో కూడిన పత్రాలతోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోండి. క్లిక్ చేయండి....
అమెరికా వీసా ప్రక్రియ సులభతరం!

ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూ, సంప్రదింపులు
ఫోన్, ఈ-మెయిల్‌తోనూ అపాయింట్‌మెంట్
కాల్‌సెంటర్ల ద్వారా సందేహాల నివృత్తి

యూఎస్ కాన్సులర్ వ్యవహారాల మంత్రి జూలియాస్టాన్లీ వెల్లడి
అమెరికా వీసా పొందే ప్రక్రియ మరింత సులభతరంగా మారుతోంది. నిబంధనలను సరళీకరిస్తున్నట్లు యూఎస్ కాన్సులర్ వ్యవహారాల మంత్రి జూలియా స్టాన్లీ గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. వీసా కోసం నిర్వహించే ఇంటర్వ్యూలు లేదా సందేహాలకు కాన్సులర్ కార్యాలయాల్లో తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సంప్రదించే వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి, వేలిముద్రలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాన్సులర్ కార్యాలయంతో ఫోన్, ఈ-మెయిల్, ఆన్‌లైన్ ఛాటింగ్ ద్వారా సంప్రదించే వీలు కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల వారం రోజుల లోపే వీసా పొందే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు. మెరుగైన సేవలను సులభంగా అందించడంతోపాటు రక్షణాత్మక ఏర్పాట్లు పెంచుతున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో జూలియా స్టాన్లీ వెల్లడించిన ముఖ్యాంశాలు... మరిన్ని వివరాలు

జీఆర్ఈలో అర్హత ఉంటే ప్రాధాన్యం
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రామాణిక పరీక్షల్లో ఉత్తీర్ణత అనివార్యం. జీఆర్ఈలో ఉత్తీర్ణత లేకపోయినా మిగిలిన వాటిల్లో ఉత్తీర్ణులైనా వీసా లభిస్తుంది. అయితే పోస్టు గ్రాడ్యుయేషన్ విద్య విషయంలో కొన్ని విశ్వ విద్యాలయాలు జీఆర్ఈకి ప్రాధాన్యం ఇస్తాయి. కాబట్టి జీఆర్ఈపైనా దృష్టిపెడితే మంచిది. ఆంగ్ల భాషపై పట్టుతో పాటు ప్రామాణిక పరీక్షలన్నింటిలోనూ మంచి స్కోర్‌ను సాధిస్తే విద్యా వీసాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. అక్కడ చదువుకునేందుకు మాత్రమే వెళ్తున్న విషయాన్ని, అందుకు అయ్యే ఖర్చును భరించే స్థోమత ఉందని కూడా ఇంటర్వ్యూ అధికారులకు స్పష్టంగా వివరించాలని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ ధనాని స్పష్టం చేశారు. అమెరికా వీసా సమస్యలపై 'అమెరికాయానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు అమె సమాధానాలు ఇచ్చారు. వాటిలో కొన్ని...క్లిక్ చేయండి....
వీసా సందేహాలకు తెలుగులో సమాధానాలు
సెప్టెంబర్ 26 నుంచి కొత్త విధానం అమలు
అమెరికా రాయబారం కార్యాలయం వెల్లడి

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు శుభవార్త. వీసా రుసుం చెల్లింపు, సమాచారం వెల్లడికి సంబంధించి దరఖాస్తుదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రక్రియను అమెరికా రాయబార కార్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ప్రక్రియ ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుంది. దరఖాస్తు రుసుమును ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో కాని, మొబైల్ ఫోన్ల ద్వారా కాని చెల్లించే వెసులుబాటు కల్పించారు. వారి పత్రాలను దేశంలోని 33 కేంద్రాల నుంచి తీసుకోవచ్చు. తొలిసారిగా ఆన్‌లైన్‌ద్వారా లేదా కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి అప్పాయింట్‌మెంట్లను తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. మరిన్ని వివరాలు
వీసా బదలాయింపు కుదరదు!
ఒక దఫా తీసుకున్న వీసాను బదలాయించుకోవడం సాధ్యం కాదు. ప్రత్యేకించి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఒక విశ్వవిద్యాలయం పేరుతో తీసుకున్న వీసా ఆ వర్సిటీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒక వేళ విశ్వవిద్యాలయం మార్చుకున్న పక్షంలో తాజాగా మరో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. అప్పుడు వీసా వస్తుందా? లేదా? అన్నది ఇంటర్వ్యూ అధికారికి మీరు చెప్పే సమాధానాలపైనే ఆధారపడి ఉంటుంది'' అని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ స్పష్టం చేశారు. అమెరికా వీసాలపై 'అమెరికాయానం'పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. క్లిక్ చేయండి....
విద్యా ప్రణాళిక పటిష్ఠంగా ఉంటే వీసా సులువే!
జీఆర్ఈల్లో మంచి మార్కులు అవసరం
ఆర్థిక పరిపుష్ఠిని రుజువు చేయాలి

వీసా జారీ చేసేందుకు సహకరించిన కంపెనీని మరో కంపెనీ టేకోవర్ చేసిన పక్షంలో ఆ వీసా ఆమోదయోగ్యం కాదు. టేకోవర్ చేసిన కంపెనీ ద్వారా తాజాగా దరఖాస్తు చేసుకోవాలి. ఏ దేశం వారినైనా అమెరికా ఆహ్వానిస్తుంది. అయితే అక్కడి చట్టాలకు లోబడి జీవనాన్ని సాగించాలి. ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడి నుంచి వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ ఆర్థిక, సామాజిక మూలాలు బలంగా ఉన్న ధ్రువపత్రాలను ఇంటర్వ్యూ అధికారికి వివరించాలని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ వెల్లడించారు. క్లిక్ చేయండి....
ఎక్కడున్నా దరఖాస్తు చేయొచ్చు
'వీసా ఒకసారి తిరస్కరించారని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తప్పులు ఎక్కడ జరిగాయో గుర్తించి సరిదిద్దుకుని మరో దఫా దరఖాస్తు చేసుకోండి. విశ్వవిద్యాలయం నుంచి అంగీకారం లభిస్తే సరిపోదు. వీసా పొందేందుకు అది ప్రామాణికం కానేకాదు. మీ విద్యా పరిణామగతి (ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డు) సజావుగా ఉండాలి. అది సక్రమంగా లేకుండా విదేశం వెళ్లి అవస్థలు పడే కన్నా ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కండి. అమెరికాలో ఫీజులు భారీగా ఉంటాయి. వాటిని ఎలా సమకూర్చుకుంటారు? మీకు ప్రాయోజితులుగా (స్పాన్సరర్స్) వ్యవహరించే వారి ఆర్థిక స్థితిగతులు, అక్కడ పన్ను చెల్లింపుల తీరు తెన్నులను వీసా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు' అని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ స్పష్టం చేశారు. క్లిక్ చేయండి....
గ్రీన్ కార్డును పునరుద్ధరించుకోవచ్చు
గ్రీన్ కార్డును ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. కావాలంటే మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అయితే పునరుద్ధరణలో ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారిలానే ప్రక్రియ ఉంటుంది. గ్రీన్ కార్డును రద్దు చేసుకున్నప్పటికీ సందర్శకుల కోటాలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రద్దు అంశం ఎలాంటి ప్రతిబంధకం కాదు అని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనానీ స్పష్టం చేశారు. క్లిక్ చేయండి....
పాస్‌పోర్ట్‌ దరఖాస్తుల స్వీకరణ సరళీకరణ
తత్కాల్‌ సహా ఎంపిక చేసిన పలు కేటగిరీల్లో కొత్త పాస్‌పోర్టుకు పెట్టుకునే దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలోనే కాకుండా నేరుగా కూడా స్వీకరిస్తారు...., ఇంకా పాస్ పోర్ట్ దరఖాస్తులకు సంబంధించి ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి శ్రీకర్‌రెడ్డి వెల్లడించిన వివరాలకు క్లిక్ చేయండి....
ఉద్యోగావకాశాలు ఘనమే!
అమెరికాలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయా కంపెనీలు ఉద్యోగానికి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలను చేపట్టిన పక్షంలో మీ పని సులువవుతుంది. ఆయా సంస్థల ఎంపికలో ముందస్తు కసరత్తు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగాలకు అనువైన పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ధనాని వెల్లడించిన వివరాలకు క్లిక్ చేయండి....
వీసా గడువు తీరకముందే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు
అమెరికా వీసాలపై ఉన్న సందేహాల నివృత్తికి సంబంధించి 'అమెరికా యానం' పేరిట 'ఈనాడు' ఆహ్వానించిన లేఖలకు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరీనా ధనానా ఇచ్చిన సమాధానాలకు క్లిక్ చేయండి....
తిరస్కరించినా మళ్లీ దరఖాస్తు చేయొచ్చు
సరైన కారణాలు చూపితే వీసా ఇచ్చేస్తారు..
అక్కడే ఉండబోమని నమ్మకం కల్పించాలి.
పాస్‌పోర్టు గడువు ముగిస్తే వీసా గడువు ముగిసినట్లు కాదు..
పలు ప్రశ్నలకు కాన్సుల్ జనరల్ కేథరిన్ ఇచ్చిన సమాధానాలకు క్లిక్ చేయండి.
వీసాల జారీలో చాలా అంశాలు పరిశీలిస్తాం
అందరికీ ఇవ్వలేం కదా...
అమెరికన్ కాన్సులేట్ జనరల్

''భారతదేశం నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అమెరికాలో చదివేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందరికీ వీసాలు ఇవ్వడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. వీసా జారీలో చాలా అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటాం. అత్యున్నత విద్యా ప్రమాణాలకు పెద్ద పీట వేసేందుకు కొంత కఠినంగా వ్యవహరించక తప్పదు''
పలు ప్రశ్నలకు కాన్సుల్ జనరల్ కేథరిన్ ఇచ్చిన సమాధానాలకు క్లిక్ చేయండి.