close

ఏపీ డీఎస్‌సీ > తాజా స‌మాచారం

డీఎస్సీ తప్పుల సవరణకు మరో అవకాశం

ఈనాడు, అమరావతి: ఏపీ డీఎస్సీ-2018 దరఖాస్తులో తప్పుల సవరణకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సమయంలో కులం, పుట్టినతేదీ, విద్యార్హతలు, సబ్జెక్టు, పోస్టులతోపాటు క్రీడా, మాజీ సైనికులు, ప్రత్యేక ప్రతిభావంతుల అంశాలకు సంబంధించి అభ్యర్థులు తప్పుగా వివరాలు నమోదు చేస్తే సరి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిసెంబ‌రు 5 ఉదయం నుంచి 6 తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్‌లో తప్పుల సవరణ చేసుకోవాలని సూచించారు. <br>
16 నుంచి ఎస్జీటీ ఆప్షన్లు: సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్టీటీ) అభ్యర్థులు డిసెంబరు 16 నుంచి పరీక్షా కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ వెబ్‌సైట్‌లో సూచించింది.
https://apdsc.apcfss.in/

Posted on 05-12-2018


Back