ఏపీపీఎస్సీ > డిగ్రీ లెక్చరర్లు > పేపర్ - I > జనరల్‌ స్టడీస్‌ అండ్ మెంటల్‌ ఎబిలిటీ

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సంఘటనలు

2. వర్తమాన అంశాలు - అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం

3. శాస్త్ర సాంకేతిక, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సమకాలీన అభివృద్ధి అంశాలు. సామాన్య శాస్త్రం (జనరల్‌ సైన్స్‌), రోజు వారి జీవితంలో దీని ఉపయోగాలు.

4. భారతదేశ చరిత్ర - భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు

5. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన; రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాల రూపకల్పన, అమలు, పరిపాలనా సంస్కరణలు, ఈ- గవర్నన్స్‌ కార్యక్రమాలు

6. స్వాతంత్ర్యానంతరం భారత ఆర్థికాభివృద్ధి

7. భారత ఉపఖండ భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ - విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు; రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

11. దత్తాంశ విశ్లేషణ
ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా
బి) విజువల్ రిప్రెజేంటషన్ ఆఫ్ డేటా
సి) ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ - సగటు, విస్తృతి, విచలన గుణకం

12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కులు
బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు
ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు
జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు