close

స్వాతంత్ర్యానంతరం భారత ఆర్థికాభివృద్ధి - ప్రణాళికల పాత్ర. భారతదేశ సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయరంగం, నీటిపారుదల, నీరు, సుస్థిరాభివృద్ధి, ద్రవ్యోల్బణం, చెల్లింపుల శేషం, నిలకడతో కూడిన వృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, వాణిజ్యం, సామాజిక రంగాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో నూతన సవాళ్లు - ప్రపంచ పోటీ, విత్త మార్కెట్ల అస్థిరత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు తదితరాలు

వ్యవ‌సాయ‌రంగం

భారతదేశ వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు, ఉత్పాదకత, తీరుతెన్నులు, పంట విస్తీర్ణం, సగటు దిగుబడులు.. అత్యంత కీలకమైన అంశాలు. వ్యవసాయం మన దేశ జాతీయాదాయం, వృద్ధిలో కీలకమైన రంగం. ముఖ్యంగా ఉపాధి కల్పన, అంతర్జాతీయ వాణిజ్యం, ఆహారభద్రత కల్పనలో ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. (పట్టిక-1 చూడండి)

మూలధన కల్పన (జీసీఎఫ్)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా
2011-12లో 8.6%, 2012-13లో 7.7%, 2013-14లో 7.9%గా నమోదైంది. దీనిలో ప్రధానంగా పంటల వాటా చాలా ఎక్కువగా ఉంది. ఇది 2011-12లో 7.4%, 2012-13లో 6.5%, 2013-14లో 6.6%గా ఉంది. అతి తక్కువగా అడవులు, కలపకు సంబం ధించి 2011-12, 2012-13, 2013-14 అన్ని సంవత్సరాల్లో కేవలం 0.1%గా ఉంది.

వ్యవసాయం, అనుబంధ రంగాల జీడీపీలో జీసీఎఫ్ వాటా
వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల దేశీయ ఆదాయం(జీడీపీ)లో స్థూల మూలధన కల్పన వాటా 2011-12లో 18.3%, 2012-13లో 15.5%, 2013-14లో 14.8%గా ఉంది. (పట్టిక-2 చూడండి)

ప్రధాన పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత (2013-14)
ఆహారధాన్యాలు: భారతదేశంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 126 మిలియన్ హెక్టార్లు ఉండగా సగటు ఉత్పత్తి 264.8 మిలియన్ టన్నులు. సగటు ఉత్పాదకత ప్రధానంగా 2,101 కిలోలుగా ఉంది.
పప్పుధాన్యాలు: పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 25.2 మిలియన్ హెక్టార్లు. 2012-13తో పోలిస్తే 8.3ృ పెరుగుదల ఉంది. పప్పుధాన్యాల ఉత్పత్తి 19.3 మిలియన్ టన్నులు, సగటు ఉత్పాదకత 764 కిలోలుగా ఉంది.
నూనెగింజలు: నూనెగింజల సాగు విస్తీర్ణం 28.5 మిలియన్ హెక్టార్లు. 2012-13లో పోలిస్తే 7.6ృ పెరుగుదల ఉంది. అయితే వీటి ఉత్పత్తి 32.9 మిలియన్ టన్నులు, 1,153 కిలోల సగటు ఉత్పత్తి ఉంది.

వ్యవసాయ పరపతి
2013-14 సంవత్సరానికి వ్యవసాయ పరపతి (రుణాల) లక్ష్యాన్ని రూ. 7,00,000 కోట్లుగా నిర్దేశించగా, రూ.7,30,765 కోట్లు ఇచ్చారు. 2012-13లో రూ.6,07,375 కోట్లు మాత్రమే వ్యవసాయ రుణాలు ఇచ్చారు. 2014-15 సంవత్సరం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 8,00,000 కోట్లు కాగా, 2014 సెప్టెంబరు 30 నాటికి రూ. 3,70,828.60 కోట్లు పంపిణీ చేశారు.

2013-14లో ప్రధాన పంటల సగటు, గరిష్ఠ-కనిష్ఠ దిగుబడులు (కి.గ్రా./ హె.)
దేశంలో ప్రధాన ఆహార పంటలు.. ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్నతోపాటు వాణిజ్య పంటలైన పత్తి లాంటి వాటివిషయంలో సగటు ఉత్పత్తులు, గరిష్ఠ-కనిష్ఠ విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. (పట్టిక-3 చూడండి)

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై)
ఆర్‌కేవీవై కింద 2015-16లో రూ. 18,000 కోట్లు కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. వీటిని 100ృ మౌలిక వసతులు, ఆస్తుల సృష్టి కోసం ఖర్చు చేసేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇచ్చింది.

జాతీయ ఆహారభద్రత మిషన్
12వ ప్రణాళిక అంతానికి 25 మిలియన్ టన్నులు అదనంగా పెంచాలన్న ఉద్దేశంతో దీన్ని అమలు చేశారు. దీనికింద 10 మిలియన్ టన్నుల (మి.ట.) అదనపు బియ్యం, 8 మి.ట. గోధుమ, 4 మి.ట. పప్పుధాన్యాలు, 3 మి.ట. ముతక ధాన్యాలు అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
* పునర్‌వ్యవస్థీకరించిన ఈ పథకాన్ని 2014-15 నుంచి 28 రాష్ట్రాల్లోని 619 జిల్లాల్లో అమలు చేస్తున్నారు.
* వాణిజ్య పంటలను కూడా 2014-15 నుంచి ఆహారభద్రత మిషన్‌కు జత చేశారు.

వ్యవసాయ పథకాలు
సాగునీటి ప్రయోజన పథకం
అసంపూర్ణంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి 1996-97లో కేంద్రం సత్వర సాగునీటి ప్రయోజన పథకాన్ని(ఏఐబీపీ) ప్రారంభించింది. దీనికింద 2014, డిసెంబరు 31 నాటికి రూ.61,195.47 కోట్ల రుణాలు/గ్రాంట్లు విడుదల చేసింది.

ఎరువుల యూనిట్ల ఆధునికీకరణ
2014-15లో ఎరువుల విధానానికి సంబంధించి కేంద్రం రెండు చర్యలు చేపట్టింది. 2014, ఏప్రిల్ 2న యూరియా యూనిట్ల ఆధునికీకరణ ద్వారా నూతన ధర విధానాన్ని ప్రకటించింది. యూరియా ఉత్పత్తిలో పెట్టుబడులకు 2013, జనవరి 2న నూతన పెట్టుబడి విధానం-2012ను ఆమోదించింది.

12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి లక్ష్యాన్ని 4ృగా నిర్ణయించగా, 201112 ధరల వద్ద 201213 లో 1.2%, 201314లో 3.7%, 201415లో 1.1% వృద్ధి సాధించారు.

మాదిరి ప్రశ్నలు
1. సమీకృత ఉద్యాన పంటల సాగు అభివృద్ధి మిషన్‌ను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
జ: 2014-15
2. నీరాంచల్ పథకాన్ని ఏ రంగ అభివృద్ధికి ప్రారంభించారు?
జ: వాటర్‌షెడ్
3. వాతావరణ మార్పు జాతీయ అనుసరణ నిధి ప్రారంభ మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు?
జ: 100
4. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి 2014-15లో ఎన్ని కోట్లు కేటాయించారు?
జ: 1000
5. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరలు సిఫారసు చేస్తుంది?
జ: 23
6. 2013-14లో ఆహార సబ్సిడీ విలువ ఎంత? (రూ.కోట్లలో)
జ: 89,740
7. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) ప్రకారం ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత వాటా ఎంత?
జ: 2.69%
8. 2013-14లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత? (మిలియన్ హెక్టార్లలో)
జ: 126
9. 2013-14లో భారత వరి సగటు ఉత్పాదతక ఎంత? (కి.గ్రా./హె.)
జ: 2424
10. 2013-14లో దేశంలో చెరకు ఉత్పత్తి ఎంత? (మిలియన్ టన్నుల్లో)
జ: 350
11. సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)ను ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1996-97
12. మూలధన కల్పనలో మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2013-14లో ఎంత?
జ: 7.9%
13. 2013-14లో నూనె గింజల సగటు ఉత్పత్తి ఎంత? (కి.గ్రా./హె.)
జ: 1153


దాసరి రాజేందర్