ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 2 > సెక్షన్‌ - 1
> 20వ శతాబ్దంపై ప్రత్యేక దృష్టితో చరిత్ర - సాంస్కృతిక‌ వారసత్వం

1. సింధు నాగరికత - వేద కాలం నాటి సామాజిక, సాంస్కృతిక‌ పరిస్థితులు - క్రీ.పూ. 6వ శతాబ్దంలో నూతన మత శాఖల ఆవిర్భావం - జైన, బౌద్ధ మతాలు, వాటి ప్రభావం - మౌర్యుల అభివృద్ధి - అశోకుడి దమ్మ విధానం, సాంఘిక, సాంస్కృతిక‌ జీవన విధానం - సంగం యుగం, సంగం యుగ సాహిత్యం - కుషాణులు, సంస్కృతిలో వారి పాత్ర - గుప్తులు, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక‌ పరిస్థితులు - హర్షవర్ధనుడు, బుద్ధిజంలో అతడి భాగస్వామ్యం

2. కంచి పల్లవులు, బాదామి చాళుక్యులు, తంజూవూరు చోళుల సామాజిక, మత పరిస్థితులు, భాషా సాహిత్యాలు, కళలు, వాస్తు శిల్పం - ఢిల్లీ సుల్తానులు - సాంస్కృతిక‌ అభివృద్ధి - భక్తి, సూఫీ ఉద్యమాల ప్రాముఖ్యత, వాటి ప్రభావం, మిశ్రమ సంస్కృతి - విజయనగర సామ్రాజ్యం - సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక‌ పరిస్థితులు

3. మొఘలులు - సామాజిక, మత జీవన విధానం, సాంస్కృతిక‌ అభివృద్ధి - శివాజీ ప్రాభవం - యూరోపియన్ల రాక - వర్తక స్థాపన - ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ అభివృద్ధి, దాని ప్రాబల్యం - పరిపాలనా సంబంధమైన మార్పులు - సామాజిక, సాంస్కృతిక‌ పరిస్థితులు - క్రైస్తవ మిషనరీల పాత్ర - బ్రిటిష్ పాలనకు అవరోధాలు - 1857 తిరుగుబాటు, దాని ప్రభావం

4. సామాజిక, మత సంస్కరణోద్యమాలు - రాజారాంమోహన్‌రాయ్‌, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనిబిసెంట్‌, సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌, ఇతరులు - బ్రాహ్మణేతర, ఆత్మ గౌరవ ఉద్యమాలు - జ్యోతిబాఫూలే, నారాయణ గురు, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, మహాత్మాగాంధీ, అండేడ్కర్, ఇతరులు

5. భారత జాతీయవాదం - జాతీయవద వృద్ధికి కారణాలు - భారత స్వాతంత్ర్యోద్యమంలో మూడు దశలు: 1885 - 1905, 1905 - 1920, 1920 - 1947 (గాంధీయుగం) - గిరిజన, రైతాంగ, కార్మికుల ఉద్యమాలు - భూస్వామ్య వ్యతిరేక, వలసవాద వ్యతిరేక పోరాటాల్లో వామపక్షాల పాత్ర - మహిళ, దళిత ఉద్యమాలు - కమ్యూనలిజం ఆవిర్భావం, అభివృద్ధి - స్వాతంత్ర్యం, భారతదేశ విభజన