ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 2 > సెక్షన్‌ - 2
> ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

1. ప్రాచీన ఆంధ్ర: శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణుకుండినుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు - మతం, భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం - వేంగి చాళుక్యుల సామాజిక జీవనం, మత విధానం, తెలుగు భాష, సాహిత్యం, అభ్యాసం, కళలు, వాస్తు శిల్పం

2. మధ్యయుగ ఆంధ్ర: క్రీ.శ. 1000 - 1565 మధ్య ఆంధ్ర దేశంలో సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులు - తెలుగు భాష, సాహిత్య అభివృద్ధి (కవిత్రయం - అష్టదిగ్గజాలు) - లలిత కళలు, చిత్రలేఖనం, వాస్తు శిల్పం, కట్టడాలు - ప్రాముఖ్యత, ఆంధ్ర చరిత్ర, సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ

3. ఆధునిక ఆంధ్ర: ఆంధ్రలో యూరోపియన్ల వర్తక స్థాపన - కంపెనీ పాలన కింద ఆంధ్ర - విద్యా విధానం - క్రైస్తవ మిషనరీల పాత్ర - సామాజిక, సాంస్కృతిక‌ చైతన్యం - వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఇతరులు -వార్తాపత్రికల పాత్ర

4. ఆంధ్రలో జాతీయోద్యమం, జాతీయోద్యమంలో ఆంధ్ర నాయకుల పాత్ర - బ్రాహ్మణేతర ఉద్యమం, జస్టిస్‌ పార్టీ - జాతీయవాద, విప్లవవాద కవిత్వం - గుర్రం జాషువా, బోయి భీమన్న, శ్రీశ్రీ, గురజాడ అప్పారావు, గరిమెళ్ల సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఇతరులు - ఆంధ్ర మహాసభ - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం - 1903 నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌, దాని సిఫార్సులు - 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం - 1956 నుంచి 2014 ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక సంఘటనలు

5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
    ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుళ్లు
    బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం
    సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు
    డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
    ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు
    ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు
    జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు