ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 2 > సెక్షన్‌ - 3
> భారత రాజ్యాంగం - విహంగ వీక్షణం

1. భారత రాజ్యాంగం - రాజ్యాంగ నిర్మాణం - బ్రిటిష్‌ పాలన వారసత్వాలు, రాజ్యాంగ సభ - రాజ్యాంగ పురోగతి - భారత రాజ్యాంగ ప్రత్యేక లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు, వాటి మధ్య సంబంధం - ప్రాథమిక విధులు - భారత రాజ్యాంగంపై సామాజిక, ఆర్థికాంశాల ప్రభావం

2. కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన నిర్వహణ, కార్యనిర్వహణ, న్యాయ నిర్వహణ, వాటి సంబంధం - రాష్ట్ర ప్రభుత్వాలు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ సంబంధాలు - శాసన వ్యవస్థ రకాలు ఏకసభ, ద్విసభా, కార్యనిర్వాహక - పార్లమెంటరీ విధానాలు - న్యాయ వ్యవస్థ - న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత

3. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - పరిపాలన, శాసన, ఆర్థిక సంస్కరణల అవసరం. రాజమన్నార్‌, సర్కారియా, ఎం.ఎం.పూంచీ సిఫార్సులు - నీతి ఆయోగ్‌ పాత్ర - భారతదేశం సమాఖ్యా లేక ఏకకేంద్ర వ్యవస్థనా? రాజ్యాంగబద్ద సంస్థల అధికారాలు - విధులు, యూపీఎస్సీ, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, కాగ్‌

4. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ వర్సెస్‌ వికేంద్రీకరణ - రాజ్యాంగ సమీక్ష కమిషన్‌, సామాజిక అభివృద్ధి పథకాలు - ప్రజాస్వామ్య మూలాలు - ప్రాంతీయ ప్రభుత్వాలు - గ్రామీణ, పట్టణ - 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు, వాటి అమలు

5. పార్టీ వ్యవస్థ - జాతీయ, ప్రాంతీయ - పార్టీ వ్యవస్థ రకాలు - ఏక పార్టీ - ద్విపార్టీ - బహుళపార్టీ - ప్రాంతీయ తత్వం - ఉప ప్రాంతీయ తత్వం - కొత్త రాష్ట్రాల డిమాండు - జాతీయ సమగ్రతకు ముప్పు - ఎన్నికలు - ఎన్నిక విధానం - ఎన్నికల కమిషన్‌ పాత్ర - సంస్కరణల అవసరం - ఓటింగ్‌ సరళి

6. సామాజిక ఉద్యమాలు, సంక్షేమ యంత్రాంగం - రైతులు, పౌర హక్కులు, మహిళలు, గిరిజనులు, దళితులు, పర్యావరణం - ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంస్కరణల ఆవశ్యకత - ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం - ఎస్సీ, ఎస్టీ, బీసీల జాతీయ, రాష్ట్రీయ కమిషన్లు - మహిళా కమిషన్లు, మైనారిటీ కమిషన్లు - మానవ హక్కుల కమిషన్‌ - సమాచార హక్కు (ఆర్‌టీఐ) - లోక్‌పాల్‌, లోకాయుక్త