ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > మెయిన్స్ > పేపర్ - 4 > సెక్షన్‌ - 2
> జీవ సంబంధ వనరులు, మానవ సంక్షేమం, జీవశాస్త్రాల్లో ఆధునిక భావనలు

యూనిట్‌ - 1: జీవ సంబంధ వనరులు: మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల ప్రాథమిక వర్గీకరణ. సూక్ష్మజీవ వనరులు - కిణ్వన అభివృద్ధి, చరిత్ర, పారిశ్రామికంగా కిణ్వన ఉత్పత్తుల ప్రాముఖ్యం - యాంటీ బయాటిక్స్‌, ఆర్గానిక్‌ యాసిడ్స్‌, ఆల్కహాల్స్, విటమిన్స్‌, ఎమినో యాసిడ్స్‌, ఇన్సులిన్‌, పెరుగుదల హార్మోన్ల వృద్ధి

యూనిట్‌ - 2: మొక్కలు, జంతు వనరులు: మొక్కల ఉపయోగాలు - ఆహారం, గ్రాసం, ఔషధాలు, నారలు, ఇతర ఉత్పత్తులు. వ్యవసాయ/ సేద్యపు మొక్కలు - మూలాలు, భారత స్థానికమైనవి. విషపూరిత మొక్కలు, జంతువులు - వన్య, గృహసంబంధ/ పెంపుడు; మనుషుల ఆహారం, ఔషధాల తయారీలో జంతువుల ఉపయోగాలు

యూనిట్‌ - 3: మానవ వ్యాధులు - సూక్ష్మజీవ ఇన్ఫెక్షన్లు: సాధారణ ఇన్ఫెక్షన్లు, నివారణ చర్యలు, బ్యాక్టీరియల్‌, వైరల్‌, ప్రోటోజ్వోవల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల పరిచయం. వ్యాధుల గురించి సాధారణ విజ్ఞానం - డయేరియా, డీసెంట్రీ, కలరా, ట్యూబర్‌క్యులోసిస్‌ (క్షయ), మలేరియా, వైరల్‌ వ్యాధులైన హెచ్‌ఐవీ, ఎన్‌సెఫలైటిస్‌, చికున్‌గున్యా, బర్డ్‌ ఫ్లూ - వ్యాధి సంభవించే సమయంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలు

యూనిట్‌ - 4: జన్యు ఇంజనీరింగ్‌, జీవసాంకేతికతల పరిచయం. జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ సాధారణ విజ్ఞానం. ఎంజైములు, ప్లాస్మిడ్లు, కణజాల వర్ధనం - పద్ధతులు, అనువర్తనాలు, మూలకణాల పరిశోధన, వ్యవసాయంలో జీవసాంకేతికత - జీవ ఎరువులు (బయోపెస్టిసైడ్స్‌, బయోఫెర్టిలైజర్స్‌), జీవ ఇంధనాలు, జన్యు పరివర్తత మొక్కలు, పశుపోషణ - ట్రాన్స్‌జెనిక్‌ యానిమల్స్‌

యూనిట్‌ - 5: వ్యాక్సిన్లు: రోగ నిరోధక పరిచయం, వ్యాక్సినేషన్‌ ప్రాథమిక భావనలు, ఆధునిక వ్యాక్సిన్ల ఉత్పత్తి (హెపటైటిస్‌ వ్యాక్సిన్ ఉత్పత్తి)