ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > ప్రిలిమ్స్ > జనరల్‌ స్టడీస్‌ అండ్ మెంటల్‌ ఎబిలిటీ

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సంఘటనలు

2. వర్తమాన అంశాలు- అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం

3. శాస్త్ర సాంకేతిక, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సమకాలీన అభివృద్ధి అంశాలు. సామాన్య శాస్త్రం (జనరల్‌ సైన్స్‌), రోజు వారి జీవితంలో దీని ఉపయోగాలు.

4. భూగోళశాస్త్రం- ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌

5. భారతదేశ చరిత్ర- ప్రాచీన, మధ్యయుగ, ఆధునికం; భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ అంశాలు

6. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన; రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాల రూపకల్పన, అమలు, పరిపాలనా సంస్కరణలు, ఈ- గవర్నన్స్‌ కార్యక్రమాలు

7. స్వాతంత్ర్యానంతరం భారత ఆర్థికాభివృద్ధి - ప్రణాళికల పాత్ర. భారతదేశ సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయరంగం, నీటిపారుదల, నీరు, సుస్థిరాభివృద్ధి, ద్రవ్యోల్బణం, చెల్లింపుల శేషం, నిలకడతో కూడిన వృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు -
బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, వాణిజ్యం, సామాజిక రంగాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో నూతన సవాళ్లు - ప్రపంచ పోటీ, విత్త మార్కెట్ల అస్థిరత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు తదితరాలు

8. పర్యావరణ క్షీణత, సవాళ్లు - సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

9. విపత్తు నిర్వహణ - విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు; రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

11. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
    ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుళ్లు
    బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం
    సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు
    డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
    ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు
    ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు
    జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు