ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 2 > సెక్షన్‌ - 1 >
ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర

1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులు - చరిత్ర దాని ప్రభావం. శాతవాహనులు- సామాజిక, ఆర్థిక, మత నిర్మాణం, సాహిత్య సేవ, వాస్తు, శిల్పం. వేంగి తూర్పు చాళుక్యులు - సామాజిక, సాంస్కృతిక సేవ - తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధి.

2. క్రీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశంలో సామాజిక, సాంస్కృతిక, మ‌త‌ప‌ర‌మైన‌ స్థితిగతులు; తెలుగు భాష, సాహిత్యం, వాస్తు, చిత్రలేఖనం అభివృద్ధి. ఆంధ్ర చ‌రిత్ర, సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ.

3. యూరోపియన్ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర. - 1857 తిరుగుబాటు - ఆంధ్రలో బ్రిటిష్‌ పాలనపై ప్రభావం - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్‌ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు. 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ పరిణామం - సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక, కిసాన్‌ ఉద్యమాలు. జాతీయవాద కవిత్వం.

4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు. ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర..

5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు - విశాలంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం, దాని సిఫార్సులు - పెద్ద మనుషుల ఒప్పందం - 1956 నుంచి 2014 మధ్యలో ప్రధాన సాంఘిక, సంస్కృతిక, సంఘటనలు.

6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
  ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుళ్లు
  బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం
  సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు
  డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
  ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు
  ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు
  జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
  హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
  ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు.