close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ

1. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత పరిస్థితి: భారతదేశ సామాజిక, ఆర్థిక లక్ష్యాలు, ఘనతలు - కొత్త ఆర్థిక సంస్క‌రణలు 1991, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ - నియంత్రణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్‌ - సహకార సమాఖ్యవాదం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి అవరోధాలు: కారణాలు, పర్యవసానాలు, పరిష్కారాలు.

2. భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు - భారత జీడీపీలో వ్యవసాయరంగ పాత్ర - వ్యవసాయ ఉత్పత్తి, పంపిణీ, విత్తపర సమస్యలు, పారిశ్రామిక విధానాలు - భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రధాన లక్షణాలు, వివిధ రంగాల కూర్పు - ఉపాధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల ఉత్పాదకత అభివృద్ధి - ఐటీ పరిశ్రమల పాత్ర.

3. వనరులు - అభివృద్ధి: వనరుల రకాలు - భౌతిక మూలధనం, విత్త మూలధనం, జనాభా - పరిమాణం, కూర్పు, పెరుగుదల - ధోరణులు, పనిలో వృత్తిపరమైన పంపిణీ - అభివృద్ధి కొలమానంగా మానవాభివృద్ధి సూచీ, జనాభాపరమైన లబ్ధి.

4. ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం: ఆర్‌బీఐ ద్రవ్య విధానం - కోశ విధానం - ధ్యేయాలు - విత్త అసమతుల్యత, ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - ప్రస్తుత ఖాతా అసమతుల్యత - ద్రవ్యోల్బణం, వాటికి కారణాలు, నివారణలు - బడ్జెట్‌ - పన్నులు, పన్నేతర ఆదాయం, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ).

5. జాతీయ ఆదాయం: జాతీయ ఆదాయం, భావనలు - స్థూల దేశీయ ఉత్పత్తి - నికర దేశీయ ఉత్పత్తి - తలసరి ఆదాయం.

6. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధానాలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు - ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో కూర్పు - గ్రామీణ - పట్టణ, లింగ నివృత్తి, వయసులవారీగా జనాభా.

7. ఆంధ్రప్రదేశ్, వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయ పాత్ర, ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు - వ్యవసాయ పద్ధతులు - సాగునీటిపారుదల విధానం, వ్యవసాయానికి ఆర్థిక వనరులు - వ్యవసాయ రాయితీలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధి, నిర్మాణం - పరిశ్రమల ప్రోత్సాహకాలు - పారిశ్రామిక కారిడార్లు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) - పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు - విద్యుత్‌ ప్రాజెక్టులు.

8. ఆంధ్రప్రదేశ్‌ వనరుల అభివృద్ధి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ వనరులు, ఆవరోధాలు - ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, నిబంధనలు సఫలీకృతం అవ్వడం - కేంద్ర సహాయం, సంఘర్షణ సమస్యలు - ప్రజారుణం- ప్రాజెక్టులకు సహాయం - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, స్థూల దేశీయ ఉత్పత్తి - భారతదేశం, ఇతర రాష్ట్రాలతో పోలికలు.