ఏపీపీఎస్సీ > గ్రూప్‌-III > పేపర్ - 1 > జనరల్‌ స్టడీస్‌

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు

2. వర్తమాన అంశాలు - అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం

3. శాస్త్ర సాంకేతిక, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సమకాలీన అభివృద్ధి అంశాలు. సామాన్య శాస్త్రం (జనరల్ సైన్స్‌) - రోజువారీ జీవితంలో దీని ఉపయోగాలు

4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర

5. స్వాతంత్ర్యానంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి

6. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

7. విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక అంశాలు (సీబీఎస్ఈ 8, 9 తరగతుల స్థాయి)

8. భారతదేశ భూగోళశాస్త్రం - భౌతిక, సాంస్కృతిక‌, జ‌నాభా, ఆర్థిక, సామాజిక మౌలికాంశాలు - ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం

9. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ

10. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

11. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
    ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుళ్లు
    బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం
    సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు
    డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
    ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు
    ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు
    జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు