close

కర్నూలు జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

చరిత్రకారుల వాదన ప్రకారం 11వ శతాబ్దంలో పశ్చిమ చాళిక్యుల పాలన కాలంలో తుంగభద్ర నది ఒడ్డున అలంపురం దేవాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన రాళ్లను కర్నూలు సమీపంలోని జగన్నాథగట్టు నుంచి బండ్ల మీద తీసుకొని వెళ్లేవారు. అలంపూర్ చేరాలంటే కర్నూలు మీదుగా తుంగభద్ర నది దాటి వెళ్లాల్సి వచ్చేది. నదిలో బండ్లు సులబంగా వెళ్లాలంటే కందెన బాగా పట్టించాలి. నది ఒడ్డున బండ్లు ఆపి, కందెన పట్టించే ప్రాంతం కాబట్టి కందెనవోలుగా, ఆపై కర్నూలుగా పేరు వచ్చిందంటారు. ఇందుకు సాక్ష్యంగా కర్నూలులోని తుంగభద్ర నదికి సమీపంలో బండిమెట్ట పేరుతో ఒక వీధి ఉంది. కర్నూలులో జరిగే సంతలో కందెన చౌకగా లభించడంతో రైతులు విరివిగా ఇక్కడ నుంచి కొని వెళ్లేవారట. కందెన దొరికే ప్రాంతం కాబట్టి కందెనవోలుగా.. ఆపై కర్నూలుగా మారిఉండవచ్చని కొందరి వాదన.

ఆంధ్రరాష్ట్రం తొలి రాజధాని
ఆంధ్ర రాష్ట్రం తొలి రాజధానిగా కర్నూలు విరాజిల్లింది
1.10.1953 నుంచి 15.11.1954 వరకు

అప్పటి మంత్రివర్గం
ముఖ్యమంత్రి: టంగుటూరి ప్రకాశం పంతులు
ఉప ముఖ్యమంత్రి: నీలం సంజీవరెడ్డి
మంత్రులు: తెన్నేటి విశ్వనాథం - ఆర్థిక
ఎస్.బి.పి. పట్టాభిరామరావు - విద్యాశాఖ.
కళావెంకట్రావు - ఆరోగ్య శాఖ
కల్లూరి చంద్రమౌళి - పరపాలకశాఖ
కె.కోటిరెడ్డి - రెవిన్యూ శాఖ
పి.తిమ్మారెడ్డి - వ్యవసాయం, అటవీ
దామోదరం సంజీవయ్య - సాంఘీక సంక్షేమం
సర్దారు గౌతులచ్చన్న - విద్యుత్ శాఖ (4.1.1954లో రాజీనామా చేశారు)
స్పీకర్: నల్లపాటి వెంకటరామయ్య(కె.ఎం.పి.పార్టీ)
డిప్యూటీ స్పీకర్: కల్లూరి సుబ్బారావు
రాష్ట్ర ఛీప్ సెక్రటరీ: ఒ.పుల్లారెడ్డి

నేటి...
జిల్లా జడ్జి కోర్టు
మెడికల్ కళాశాల
కె.వి.ఆర్. కళాశాల
ఎస్.టి.బి.సి.
కలెక్టర్ బంగ్లా
ప్రభుత్వ జూనియర్ కాలేజి(టౌన్)
మెడికల్ కాలేజి హాస్టల్ (మెన్)
ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్

ఆనాటి...
రాష్ట్ర శాసనసభ
సెక్రటేరియట్
రాజభవన్
ముఖ్యమంత్రి నివాస కార్యాలయం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం
ఎమ్మెల్యే క్వార్టర్స్
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్
ఏపీపీఎస్‌సీ కార్యాలయం

జిల్లాలో తొలివిద్యా సంస్థ : నంద్యాలలో బాలుర బోర్డింగ్ హైస్కూల్ (1855)
తొలి రైలు బ్రిడ్జి : తుంగభద్రనదిపై మంత్రాలయం వద్ద నిర్మించారు.
జిల్లాలో మొదటి కళాశాల : ఉస్మానియా కాలేజి
జిల్లాలో మొదటి పంచాయితీ : కోడుమూరు (1959)
జిల్లా పరిషత్ తొలి ఛైర్మన్ : కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
తొలి పార్లమెంటు సభ్యులు-కర్నూలు : శ్రీ హెచ్‌సీతారామిరెడ్డి కాంగ్రెస్ (1952)
నంద్యాల : శ్రీ శేషగిరిరావు ఇండిపెండెంట్ (1952)
మొట్టమొదట కరెంటు వెలుగు వచ్చింది : కర్నూలు పట్టణం (1928)
జిల్లా నుంచి వెలువడిన తొలి పత్రిక : అరుణోదయం పక్ష పత్రిక (1923)
జిల్లా సహకార సంఘాల వ్యవస్థాపకులు : మాచాని సోమప్ప (ఎమ్మిగనూరు వీకర్స్ ఆపరేటీవ్ సొసైటీ 1938 ఏర్పాటు చేశారు.
తొలి పశుక్షేత్రం : బనవాసి (1928)
రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్‌యార్డు : ఆదోని
మెడికల్ కళాశాల తొలి ప్రిన్సిపాల్ : దా.సి.వెంకటరామయ్య
మొదటి రిజిస్ట్రేషన్ కారు : ఏపీక్యూ అప్పటి కలెక్టర్ బి.ఎస్.దత్తా పేరు మీద రిజిష్టర్ అయ్యింది.
1952వ సంవత్సరంలో కర్నూలులో ప్రారంభించిన బీఈడీ కళాశాల రాయలసీమ ప్రాంతంలో మొదటిది.
జిల్లాలో మొట్టమొదటి సారిగా ముత్యాలపాడు గ్రామంలో 1857లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణలో ఏర్పాటైన మొట్టమొదటి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ కళాశాల. ఆంధ్రరాష్ట్రం అవతరించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీనిని కర్నూలులో ఏర్పాటు చేశారు.
జిల్లాలో మొదటి సారిగా గుర్తింపు పొంది రిజిష్టర్ అయిన గ్రంథాలయం పత్తికొండ రీడింగ్ రూం. ఇది 1920లో రిజిష్టర్ అయ్యింది.
తొలి ప్రత్తి వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల కేంద్రంగా 1966 లో ఏర్పాటైంది. ఆ తర్వాత ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంగా రూపుదిద్దుకొంది.

విద్య

రాయలసీమ విశ్వవిద్యాలయం
ఉపకులపతి 9849412455
రిజిస్ట్రార్ 9440861023
ప్రిన్సిపల్ 9849009982

జిల్లాలోని పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
* కేంద్రీయ విద్యాలయం -1 (కర్నూలు) : 272667
* జవహర్ నవోదయ పాఠశాల-1 (బనవాసి) : 9440996192
* ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (సీబీఎస్ఈ) : 5
* ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు : 51
* ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు : 2
* ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 24
* మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు : 112
* మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలు : 12
* మున్సిపల్ ఉన్నత పాఠశాలలు : 13
* జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు : 264
* మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు : 1638
* మండల పరిషత్ ప్రాతమికోన్నత పాఠశాలలు : 521
* ప్రైవేటు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు : 103
* ప్రైవేట్ ఎయిడెడ్ యూపీఎస్ పాఠశాలలు : 26
* ప్రైవేట్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు : 48
* ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు : 235
* ప్రైవేట్ అన్ఎయిడెడ్ యూపీఎస్ పాఠశాలలు : 275
* ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు : 204
* ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలలు : 8
* ఏపీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు : 13
* ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు : 3
* కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు : 22
* గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు : 19
* గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలు : 7

నదులు - ప్రాజెక్టులు

తుంగభద్ర: తుంగభద్ర నది కౌతాళం మండలం మేళగనూరు గ్రామం వద్ద కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొత్తపల్లి మండలం సంఘమేశ్వరం వద్ద కలుస్తోంది. నదీపై 20 ఎత్తిపోత్తల పథకాలు నిర్మించారు. సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు, జిల్లాలోని 171 గ్రామాలకు తాగునీరందుతోంది. 2008లో తుంగభద్ర పుష్కరాలు నిర్వహించారు. దాదాపు 4లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ప్రతి 12ఏళ్లకోసారి పుష్కరాలు నిర్వహస్తారు. తుంగభద్రనది ఉగ్ర రూపానికి 1992, 2009లో వరదలు వచ్చినప్పుడు దాదాపు 37 గ్రామాలు ముంపునకుగురై భారీ ఆస్తినష్టం వాటిల్లింది. మంత్రాలయం, నాగలదిన్నె, గుండ్రేవుల, నదికైరవవాడి, మేళగనూరు, తదితర గ్రామాలు నష్టాపోయి.

కృష్ణా నది: జురాల ప్రాజెక్టు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తోంది. అలంపూరు నుంచి సంఘమేశ్వరం వద్ద కలుస్తుంది. పోతిరెడ్డిపాడు, గంగ కాలువల కింద 3లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. 68 గ్రామాలకు మంచినీటి వసతికల్పించారు. కృష్ణా నది పుష్కరాలు 2002లో వచ్చాయి. 2009లో వచ్చిన వరదలకు వెలుగోడు, నందికోట్కూరు మండలల్లోని కొన్ని గ్రామాలు నీటమునిగాయి.

కుందూ నది: ఈ నది వెలుగొడు వద్ద పుట్టి నంద్యాల గుండా పెన్నానదిలో కలుస్తోంది. దాదాపు లక్ష ఎకరాలకు పెన్నా నది నుంచి నీటి వసతి ఉంది. అనంతపురం, కడప జిల్లాల వరకు నది విస్తరించి ఉంది. 61 గ్రామాలకు తాగునీటి సదుపాయం ఉంది.

హంద్రీ నది: మద్దికెర, పత్తికొండ మధ్యన వంకలో పుట్టి ఆ తర్వాత వాగులన్ని కలిసి నదిగా ఏర్పడింది. కర్నూలులోని సంఘమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతోంది. గాజులదిన్నె ప్రాజక్టుద్వారా సాగునీరు నిల్వచేసి, 54372 ఎకరాలు సాగుచేస్తారు. మూడు ఎత్తి పోత్తల పథకాలు ఉన్నాయి. 70 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి ఉంది. 2009లో వచ్చిన వరదలతో 8 గ్రామాలు నీట మునిగాయి.

గుండ్లకమ్మ వాగు: జిల్లాలోని నల్లమల్ల అడవులల్లోని నల్లకాలువలో పుట్టి మర్కాపురం వద్ద ప్రకాశం జిల్లా సరిహద్దులో కలుస్తోంది. ఎక్కువగా ప్రకాశం జిల్లాకు సాగునీరందిస్తోంది. కండలేరు, సోమశిల ప్రాజక్టులు దీని కింద ఉన్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టు..
రాష్ట్రానికి శ్రీశైలం ఆనకట్ట వెన్నెముక.సాగు, తాగునీటితో పాటు, జలవిద్యుత్తు వెలుగులందిస్తూ పక్క రాష్ట్రం తమిళనాడుకు కూడా తాగునీరందిస్తోంది. నల్లమలలో శ్రీశైలం ఆనకట్టను రెండు జిల్లాల మద్యన నిర్మిచారు.ఆనకట్ట కుడిగట్టు(కర్నూల్‌జిల్లా), ఎడమగట్టు(మహబూబ్‌నగర్ జిల్లా)లో ఉన్నాయి. ఆనకట్ట నిర్మాణానికి కావలసిన భూమిని (సిబ్బంది నివసించడానికి, కార్యాలయాలకోసం) కుడిగట్టున 1468.52ఎకరాలు, ఎడమగట్టున 890ఎకరాలను ప్రభుత్వం సమకూర్చింది. మూడవ పంచవర్ష ప్రణాళిక 1961, 1966మధ్య కాలంలో ఇక్కడ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు తీర్మానించారు.భారత తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ 24జూలై1963న శంఖుస్దాపన చేశారు. అప్పుడు మన రాష్ట్రానికి నీలంసంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నారు. ఆనకట్ట నిర్మాణానికి 26.03.1964న ప్లానింగ్ కమిషన్ నుంచి అనుమతులు లభించాయి. శ్రీశైలం ఆనకట్టకు 200కి.మీ., దూరంలో హైద్రాబాద్, మరో రెండు ముఖ్య పట్టణాలు కర్నూల్, విజయవాడలు 180, 250 కి.మీటర్ల దూరంలో వున్నాయి. మన దేశంలో కృష్ణానది నాలుక ఆకారంలో 2,58,445 చదరపు కిలోమీటర్లు ప్రవహించే రెండో అతిపెద్దనది. మహారాష్ట్ర, కర్నాటక, అంధ్రప్రదేశ్‌లో 1240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువున 2,06,030చదరపు కిలోమీటర్ల నీటిపరీవాహకం కల్గివుంది.

ఎల్లెల్సీ
జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ). ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఖరీఫ్, రబీలో కలిపి 1,51,134 ఎకరాలకు సాగునీరు అందాలి. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు 24 టీఎంసీల నీటివాటా ఉంది.

సంజీవయ్య సాగర్
గోనెగండ్ల దగ్గర హంద్రీనదిపై ఈ జలాశయం నిర్మించారు. 4.5 టీఎంసీల నీటి సామర్థ్యం. గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల్లో 25,488 ఎకరాల ఆయకట్టు ఉంది.

ఆలూరు బ్రాంచి కాలువ (హెచ్చెల్సీ)
ఆలూరు నియోజకవర్గంలో హెచ్చెల్సీ కింద 14,250 ఎకరాలకు సాగునీరు అందాలి. చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. హెచ్చెల్సీ నుంచి 0.816 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నారు.

గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రూ.180 కోట్లతో పథకం చేపట్టారు. తుంగభద్ర నది నుంచి 3.725 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 12 జలాశయాల్లో నింపి పంట చేలకు నీటిని సరఫరా చేయాలి. పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

కేసీ కాలువ
సుంకేశుల జలాశయం అనుసంధానంగా కడప కర్నూలు కాలువ (కేసీ) 306 కి.మీ పొడవున ఉంది. కడప జిల్లాలో 2,65,628 ఎకరాలకు, కర్నూలు జిల్లాలో 1,73,587 ఎకరాలకు కేసీ నీటిని ఇవ్వాలి.

తెలుగు గంగ
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు 11.75 టీఎంసీల నీటిని మళ్లించి 65,304 ఎకరాలకు సాగునీరు, నంద్యాల, చెన్నైలకు తాగునీరు అందిస్తున్నారు.

ఎస్ఆర్‌బీసీ
భానకచర్ల రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్‌బీసీ కాలువకు నీటిని మళ్లించి 65వేల హెక్టార్లకు సాగునీరు ఇస్తున్నారు. ఇదే కాలువ ఆధారంగా గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, అవుకు రిజర్వాయరు వంటి పనులు చేపట్టారు.

హంద్రీనీవా
నందికొట్కూరు మాల్యాల దగ్గర ఎత్తిపోతల పథకం నిర్మించి శ్రీశైలం జలాశయం ఉపరితలంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం.

నీటిపారుదల

జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ). ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఖరీఫ్ రబీలో కలిపి 1,51,134 ఎకరాలకు సాగునీరు అందాలి. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు 24 టీఎంసీల నీటివాటా ఉంది. గోనెగండ్ల దగ్గర హంద్రీనదిపై ఈ జలాశయం నిర్మించారు. 4.5 టీఎంసీల నీటి సామర్థ్యం. గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల్లో 25,488 ఎకరాల ఆయకట్టు ఉంది. హెచ్చెల్సీ కింద చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. తుంగభద్ర నది నుంచి 3.725 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 12 జలాశయాల్లో నింపి పంట చేలకు నీటిని సరఫరా చేయాలి. పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు 11.75 టీఎంసీల నీటిని మళ్లించి నంద్యాలకు తాగునీరు, 65,304 ఎకరాలకు సాగునీరు, చెన్నైకు తాగునీరు అందిస్తున్నారు. భానకచర్ల రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్‌బీసీ కాలువకు నీటిని మళ్లించి 65వేల హెక్టార్లకు సాగునీరు ఇస్తున్నారు. ఇదే కాలువ ఆధారంగా గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, అవుకు రిజర్వాయరు వంటి పనులు చేపట్టారు. నందికొట్కూరు మాల్యాల దగ్గర ఎత్తిపోతల పథకం నిర్మించి శ్రీశైలం జలాశయం ఉపరితలంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం.

ప్రధాన పంటలు

నేలలు:
జిల్లాలో ప్రధానంగా నేలలు మూడురకాలు:
1. నల్లరేగడి నేలలు (బరువైనవి)
2. నల్లరేగడి నేలలు (తేలిక పాటి)
3. ఎర్రనేలలు

వ్యవసాయ భూమి వివరాలు
భౌగోళిక విస్తీర్ణం : 17.66 లక్షల హెక్టార్లు
అడవులు : 3.18 లక్షల హెక్టార్లు
మొత్తం సాగు విస్తీర్ణం : 9.39 లక్షల హెక్టార్లు
నికర సాగు విస్తీర్ణం : 8.50 లక్షల హెక్టార్లు
సాగుచేయని విస్తీర్ణం : 1.17 లక్షల హెక్టార్లు
సాగుచేయని బీడు భూమి : 0.99 లక్షల హెక్టార్లు
వ్యవసాయ యోగ్యం కాని భూమి : 1.00 లక్షల హెక్టార్లు
వ్యవసాయేతర భూమి : 0.81 లక్షల హెక్టార్లు
ప్రస్తుత బంజరు : 1.89 లక్షల హెక్టార్లు
ఖరీఫ్ : 6.51 లక్షల హెక్టార్లు
రబీ : 3.24 లక్షల హెక్టార్లు
జిల్లాలో వరి, జొన్న, వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడు పంటలు ప్రధానంగా పండిస్తారు.
జిల్లాలో ఎరువుల వాడకం ఎక్కువ-గుంటూరు తర్వాత ద్వితీయ స్థానం కర్నూలు జిల్లానే.

జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాలు:
ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఏర్పాటయ్యాయి. నంద్యాల రైతు శిక్షణా కేంద్రం, తంగడెంచ, ఎదురూరు, ఎమ్మిగనూరులలో విత్తన ఉత్పత్తి క్షేత్రాలు, ఎమ్మిగనూరులో ప్రాజెక్టు ఉద్ధరణ ప్రదర్శన క్షేత్రాలు ఉన్నాయి.

వాటర్ షెడ్:
జిల్లాలోని వివిధ పథకాల క్రింద అమలవుతున్న వాటర్‌షెడ్లు : 741
వాటర్ షెడ్ కమిటీల సంఖ్య : 741
జిల్లాలో అభివృద్ధి చేయాల్సిన బంజరు భూమి : 3.88 లక్షల హెక్టార్లు
వాటర్‌షెడ్ ద్వారా అభివృద్ధిలోకి వచ్చిన భూమి : 1.72 లక్షల హెక్టార్లు

పర్యాటకం

శ్రీశైలం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున మహాలింగం, అష్టాదశ శక్తిపీఠాల్లోని భ్రామరీ శక్తిపీఠం భక్తజనం పూజలందుకుంటోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం చుట్టూ అనేక సందర్శనీయ స్థలాలు, ఆలయాలు ఆధ్యాత్మికత ప్రేరణ, మానసిక ఆహ్లాదానికి నెలవయ్యాయి. శ్రీశైలానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. కర్నూలు నుంచి శ్రీశైలం 180 కి.మీ దూరంలో ఉంది.

మహానంది
కామేశ్వరి సహిత మహానందీశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం మహానంది. ఈ క్షేత్రం పరిసరాల్లో శ్రీకామేశ్వరీదేవి అమ్మవారు, ఆంజనేయస్వామి, శ్రీకోదండరామాలయం, వినాయక నంది, గరుడనంది, గోర్లయ్యమఠం, దేశంలోనే అతి పెద్ద నంది, జీనశంకర తపోవనం, శ్రీకాశిరెడ్డినాయన బృందావనం వంటి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడి కోనేర్లలోని నీరు ఐదు అడుగుల లోతు నిలిచి ఉంటుంది. చలికాలం వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉండటం ఈ కోనేర్ల ప్రత్యేకత. కర్నూలు నుంచి మహానంది క్షేత్రం 96 కి.మీ దూరంలో ఉంది.

అహోబిలం.. ఆధ్యాత్మిక నందనం
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్లు దూరంలో ఉన్న వైష్ణవయాత్రికుల పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని రాక్షస సంహారక్రియను చూసిన ముక్కోటి దేవతలు ఆహా బలం ఆహోబలం అని ఆశ్చర్యంలో కొనియాడారు. కాలక్రమేణా అహోబిలంగా ఈప్రాంతం గుర్తింపు పొందింది. బ్రహ్మాండ పురాణంలో హిరణ్యకశిపుడి రాజ భవనం ఇక్కడే ఉండేదని ఉగ్ర నరసింహ రూపంలో స్తంభం నుంచి వచ్చిన స్తంభాన్ని ఉగ్రస్తంభంగా పిలుచుకుంటున్నారు. నరహరి భక్తుల కోసం తొమ్మింది ప్రదేశాల్లో అవతారాన్ని చూపడంతో ఈ ప్రదేశాలు నవనారసింహ క్షేత్రాలుగా వ్యవహరింపబడుతున్నాయి.

మంత్రాలయం
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు దర్శించే క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర మఠం. తుంగభద్ర నదీతీరంలో వెలసిన ఈ క్షేత్రం కర్నూలుకు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నందవరం చౌడేశ్వరి: బనగానపల్లి మండలం నందవరంలో కొలువైన చౌడేశ్వరి అమ్మవారు భక్తుల నుంచి సేవలు పొందుతున్నారు. ఈ క్షేత్రం కర్నూలుకు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేతంచెర్ల మండలం మద్దిలేటయ్య క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందిందే. ఈ క్షేత్రం కర్నూలుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

యాగంటి
ఎర్రమల కొండల్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండల మధ్య యాగంటిలో ఉమామహేశ్వరస్వామి కొలువయ్యారు. ఆలయ భాగంలో బసవన్న భక్తులను ఆకట్టుకుంటుంది. పక్కనే గుహలు చూడముచ్చటగా ఉంటాయి. ఓ గుహలో శ్రీవేంకటేశ్వరస్వామి పక్కనే రోకళ్ల గుహ, శంకరగుహ, ఎర్రజాల గుహలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చిన్నకోనేరు, పెద్దకోనేరు నిత్యం నీటితో కనిపిస్తాయి. యాగంటి కర్నూలుకు 85 కి.మీ దూరంలో ఉంది.

పరిశ్రమలు

జిల్లాలో చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు 32 ఉన్నాయి. అందులో ప్రధానమైనవి.

ఎ.పి.కార్బైన్స్ లిమిటెడ్
దిన్నెదేవరపాడు, కర్నూలు జిల్లా. డైరెక్టర్ ఎన్.బాబురావు.రూ.730 లక్షలతో 2004లో దీనిని ఏర్పాటు చేశారు. భరత్ ఎనర్జీ లిమిటెడ్ దీన్ని టేకోవర్ చేసింది. 180 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంవత్సరానికి 12 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం. ఫోన్: 08518 237845, 237846, 237847.

రాయలసీమ పేపర్ మిల్లు
కర్నూలు జిల్లా గొందిపర్ల వద్ద 1974లో 1600 మంది కార్మికులతో రూ.6 వేల లక్షల పెట్టుబడితో బి.వి.సత్యనారాయణ ప్రసాద్ రాయలసీమ పేపర్ మిల్లును స్థాపించారు. దీని ఉత్పత్తి సామర్థ్యం 78500 టన్నులు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ. 8-3-960-11. ఫోన్: 040 23756947

శ్రీ రాయలసీమ అల్కాయిల్స్ లిమిటెడ్
కర్నూలు మండలం గొందిపర్ల వద్ద శ్రీ రాయలసీమ అల్కాయిల్స్ లిమిటెడ్‌ను 1987లో రూ.36 లక్షలతో మంత్రి టి.జి.వెంకటేశ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీని సామర్థ్యం 1,41,18,690 టన్నులు. కర్నూలు మౌర్యాఇన్ కాంప్లెక్స్ ప్రధాన కార్యాలయం. ఫోన్: 08518 221520

శ్రీరాయలసీమ హైస్ట్రెన్త్ హైపో లిమిటెడ్ (కెమికల్స్)
గొందిపర్ల వద్ద 1995లో రూ.6500 లక్షలతో స్థాపించారు. టి.జి.భరత్ మేనేజింగ్ డైరెక్టర్. మౌర్యాఇన్ కాంప్లెక్స్ ప్రధాన కార్యాలయం. ఫోన్: 08518 220164. సంవత్సరానికి 99900 టన్నుల ఉత్పత్తితో 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

శ్రీరాయలసీమ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్
2001లో కల్లూరు మండలం పందికోన వద్ద రూ.2,050 లక్షలతో కె.మధుసూదన్ స్థాపించారు. పవర్ ఉత్పత్తి ప్రధానం. ఫోన్: 08518 236550

శ్రీరాయలసీమ అల్కాయిల్స్
టి.జి.వెంకటేష్ గొందిపర్ల వద్ద 2002లో స్థాపించారు. రోజుకు 10 ఎం.డబ్ల్యు. సామర్థ్యంలో పవర్ జనరేషన్ దీని లక్ష్యం. రూ.1400 లక్షలతో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మౌర్యాఇన్ కాంప్లెక్స్ ప్రధాన కార్యాలయం. ఫోన్: 08518 221520
* పై చిరునామాతోనే 2002లో గొందిపర్ల వద్ద రూ.1200 లక్షలతో మరో పవర్ జనరేషన్ కేంద్రాన్ని టి.జి.వెంకటేష్ ఏర్పాటు చేశారు.
* రాయలసీమ అల్కాయిల్స్ పేరుతో మరో నాలుగు కర్మాగారాలు గొందిపర్ల వద్ద ఉన్నాయి.

పాణ్యం సిమెంటు అండ్ మినరల్ ఇండస్ట్రీ
వి.రామనాథ్ బేతంచెర్ల మండలం సిమెంటు నగర్ వద్ద 1955లో రూ.3612 లక్షలతో 22000 టన్నుల సామర్థ్యంతో పాణ్యం సిమెంటు అండ్ మినరల్ ఇండస్ట్రీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 741 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధాన కార్యాలయం 8-2-269-ఎస్-51, ప్లాట్ నెం: 51, స్ట్రీట్ నెం:5, సాగర్ సొసైటీ, రోడ్ నెం:2, బంజారాహిల్స్, ఫోన్: 040 23556674, 23556675

ప్రియదర్శిని సిమెంట్స్
ప్యాపిలి మండలం రాచెర్ల వద్ద టి.తారకరామప్రసాద్ ప్రియదర్శిని సిమెంట్స్‌ను 1999లో రూ.12000 వేల లక్షలతో స్థాపించారు. ప్రస్తుతం ఇక్కడ 350 మంది కార్మికులు పని చేస్తున్నారు. 198000 టన్నుల సామర్థ్యం. ప్రధాన కార్యాలయం: రాచర్ల, ప్యాపిలి మండలం, ఫోన్ 08522 249952
* దీనికి అనుబంధంగానే మరో సిమెంటు కర్మాగారం ఉంది.

సుచన్ పవర్‌గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్
2002 డిసెంబరులో గంటకు 6 ఎం.డబ్ల్యు. సామర్థ్యంతో రూ.2500 లక్షలతో నంద్యాల వద్ద స్థాపించారు. ట.సుబ్బరాయుడు మేనేజింగ్ డైరెక్టర్. 130 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సెల్: 9849067616

బాషా పీవీసీ ఇండస్ట్రీస్
నంద్యాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద బాషా పీవీసీ ఇండస్ట్రీస్‌ను 2001లో రూ.187.86 లక్షలతో స్థాపించారు. 30 మంది కార్మికులతో ఎస్.చాంద్‌బాష దీనిని నెలకొల్పారు. ఫోన్: 08514 243100
రాయలసీమ షుగర్స్ లిమిటెడ్ నంద్యాల సమీపంలోని అయ్యలూరు మెట్ట వద్ద 1983లో కె.మదుసూధన్ రూ.822 లక్షలతో స్థాపించారు. దీనిసామర్థ్యం సంవత్సరానికి 375000 టన్నులు. ఫోన్: 08514 245506

ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్
నంద్యాల ఉడుములపురం వద్ద 2008లో రూ.11810 లక్షలతో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. ఇక్కడ 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్
2003లో పాలు, పాల ఉత్పత్తుల తయారీ లక్ష్యంతో నారా భువనేశ్వరి, నాగరాజు నాయుడు సంయుక్తంగా ఆళ్లగడ్డ సమీపంలోని సాంబవరం వద్ద హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌ను రూ.100.36 లక్షలతో స్థాపించారు. ఇక్కడ 130 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పంజాగుట్ట, హైదరాబాద్ ప్రధాన కార్యాలయం. ఫోన్: 040 23391221

ఐటీసీ ఆగ్రోటెక్ లిమిటెడ్
2004లో మంత్రాలయం మండలం తుంగభద్ర వద్ద రూ.7500 లక్షలతో టి.ఎల్.జి.ప్రసాద్ రావు ఐటీసీ ఆగ్రోటెక్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఫోన్: 08512 259903