close

తాజా స‌మాచారం

ఎఫ్‌ఆర్‌వో పోస్టుల భర్తీకి ప్రకటన జారీ

* డిసెంబర్‌ 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్స్‌(ఎఫ్‌ఆర్‌వో) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం(డిసెంబర్‌ 5) ప్రకటన జారీ చేసింది. నాలుగు పూర్వ ఖాళీలతో కలుపుకుని మొత్తం 24 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. వ్యవసాయం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్‌ అప్లికేషన్స్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ తదితర సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. దేహదారుఢ్య పరీక్షల అనంతరమే అభ్యరుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుల సంఖ్య 25 వేలు దాటితే ప్రాథమిక పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలను ఏప్రిల్‌ 28, 29, 30 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబర్‌ 10 నుంచి 31వ తేదీ మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇతర వివరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Posted on 06-12-2018