close

తాజా స‌మాచారం

301 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు


అమరావతి: 301 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబ‌ర్ 28న‌ ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో శాసనసభ అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు 2, ఐ అండ్‌ పీఆర్‌ శాఖలో 15 అసిస్టెంట్‌ పీఆర్‌వో పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్‌ విభాగంలో డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ -2 పోస్టులు 20 కాగా... వ్యవసాయ శాఖ అధికారి పోస్టులు 27 ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 237 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల కోసం కూడా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 

Posted on 28.12.2018