close

తాజా స‌మాచారం

ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 446 గ్రూప్‌-2 స‌ర్వీస్‌ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 110 పాత పోస్టులతో పాటు 336 కొత్త పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో సచివాలయంలోని జీఏడీ విభాగానికి సంబంధించి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో 150 పోస్టులున్నాయి. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3 పోస్టులతో పాటు అసిస్టెంట్ క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ ఆఫీస‌ర్‌, డిప్యూటీ తహశీల్దార్‌, ఈవోపీఆర్‌డీ, ఆబ్కారీశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, రిజిస్ట్రేషన్‌శాఖ, దేవాదాశాఖలో గ్రేడ్‌-2, గ్రేడ్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

Posted on 31.12.2018