close

తాజా స‌మాచారం

ఏప్రిల్‌ 11న గ్రూపు-1 ఇంటర్వ్యూలు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 (2016) ప్రకటనకు సంబంధించి ఏప్రిల్‌ 11వ తేదీన మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. అనర్హులైన తొమ్మిది మందికి గతంలో ఏపీపీఎస్సీ మౌఖిక పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి పేర్లను తొలగించి ప్రధాన పరీక్షల్లో సాధించిన మార్కులను అనుసరించి నూతనంగా ఎంపిక చేసిన వారికి మౌఖిక పరీక్షలు జరుపనున్నారు. సంబంధిత వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. మరోవైపు.. గ్రూపు-1 (2011) నోటిఫికేషన్‌ మేరకు ప్రకటించిన ఎంపిక జాబితా ప్రకారం వివిధ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఆరుగురు తమకు కొలువులు అక్కర్లేదని స్పష్టం చేశారు. వీరు ఇప్పటికే ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం లేదా 2016 నోటిఫికేషన్‌ ద్వారా మంచి ఉద్యోగాలు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Posted on 30-03-2018