close

తాజా స‌మాచారం

గ్రూపు-1లో 75మందికి పోస్టులు కేటాయింపు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1(2016) ఉద్యోగాల ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది. 78ఖాళీలకు గాను 75మందికి పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. ఎస్సీ(మహిళ), బీసీ-ఈ(మహిళ), పీహెచ్‌(మహిళ) విభాగాల్లో అర్హులైన వారు లేనట్లు వెల్లడించింది. డిప్యూటి కలెక్టర్లు-4, వాణిజ్యపన్నుల అధికారులు-13, జిల్లా రిజిస్ట్రార్లు-6, డీఎస్పీ-24, ఎక్సైజ్‌ సహాయ పర్యవేక్షకులు జోన్‌-1లో 3, జోన్‌-2లో 5, జిల్లా బీసీ సంక్షేమ అధికారులు-1, పురపాలక కమిషనర్లు గ్రేడ్‌-2 జోన్‌లో 7, కార్మికశాఖ సహాయ కమిషనర్లు జోన్‌-1లో 5, జోన్‌-2లో ఐదుగురికి పోస్టులు కేటాయించారు. తమకు ఇష్టం లేదని ఇద్దరు అభ్యర్థులు ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకోలేదని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఎంపిక జాబితా

Posted on 19-04-2018