close

తాజా స‌మాచారం

కొన్ని సబ్జెక్టుల్లో అర్హులే లేరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్యుల నియామక రాత పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులకు అర్హులు కరవయ్యారు. అభ్యర్థులు కొందరు కనీస అర్హత మార్కులు సాధించలేకపోయారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో కొందరికి మైనస్‌ మార్కులు కూడా వచ్చాయి. విశ్వవిద్యాలయాల నుంచి విజ్ఞప్తులు వస్తే అర్హులులేని సబ్జెక్టులకు ఏపీపీఎస్సీ మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. వయోజన విద్యలో ఇద్దరు రాయగా ఒక్కరూ అర్హత సాధించలేదు. ఇందులో ఒకరికి మైనస్‌ మార్కులు వచ్చాయి. సంస్కృతం, భౌతిక శాస్త్రం, మాస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజం, హిందీ, న్యాయశాస్త్రం, జియాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పరీక్షల్లోనూ పలువురు అభ్యర్థులకు మైనస్‌ మార్కులు వచ్చాయి.


Posted on 18-07-2018