close

తాజా స‌మాచారం

6 నుంచి ఏపీ డీఎస్సీ సంగీత నైపుణ్య పరీక్షలు


ఈనాడు, అమరావతి: ఏపీ డీఎస్సీ-2018 మ్యూజిక్‌ ఉపాధ్యాయులకు జ‌న‌వ‌రి 6 నుంచి 12 వరకు విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. అభ్యర్థులు ఏ రోజున సంగీత పరీక్షకు హాజరుకావాలో వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. జ‌న‌వ‌రి 6న కానిస్టేబుల్‌, ఇతరాత్ర పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి హాల్‌టిక్కెట్లను తీసుకొని వస్తే మ్యూజిక్‌ అభ్యర్థులకు 12న, భౌతికసామర్థ్య పరీక్షలను 11న పురుషులకు, 13న మహిళలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

https://apdsc.apcfss.in/

Posted on 06. 01.2019