close

తాజా స‌మాచారం

గ్రూప్‌-1 సిలబస్‌ మార్పుపై భిన్నాభిప్రాయాలు

ఈనాడు అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ముసాయిదా సిలబస్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీపీఎస్సీ ముసాయిదా సిలబస్‌ను వెబ్‌సైట్లో పెట్టి అభిప్రాయాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే! స్థూలంగా అభ్యర్థుల నుంచి వస్తున్న అభిప్రాయాలివీ.
* పేపర్‌-2 లో కొత్తగా ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, ఎంపతీ, డెసిషన్‌ మేకింగ్‌, సోషల్‌ ఇంటెలిజెన్స్‌ అంశాలు చేర్చారు. వీటికి పాఠ్యపుస్తకాల కొరత ఉంది. దీనితో విద్యార్థులు వీటికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వారికి ఆర్థికంగా ఇబ్బందే కాక సమయభావం కూడా.
* ప్రాథమిక పరీక్షలో ప్రశ్నల సంఖ్య పెంచడంతో నైపుణ్యంగల విద్యార్థుల ఎంపికకు అవకాశం ఉంటోంది.
* తెలుగును అర్హత పేపరుగా చేర్చి మాతృభాషకు ప్రాధాన్యం ఏర్పడుతుంది.
* సివిల్‌ సర్వీసెస్‌ సిలబస్‌ మాదిరిగా గ్రూప్‌-1 పరీక్ష విధానాన్ని మార్పు చేయాలి. దీనితో విద్యార్థులు, రెండు పరీక్షలకు ఒకే తీరు సన్నద్ధతతో తయారయ్యే వెసులుబాటు కలుగుతుంది.


Posted on 29-07-2018