close

తాజా స‌మాచారం

ఒకే సిలబస్‌తో గ్రూపు-2 పరీక్షలు!

* పరిశీలన జరుపుతున్న ఏపీపీఎస్సీ
ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ప్రాథమిక, ప్రధాన రాత పరీక్షలను ఒకే సిలబస్‌తో నిర్వహించే విషయాన్ని ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం సిలబస్‌ వేర్వేరుగా ఉండడంతో సన్నద్ధతపరంగా సమయం సరిపోక ఇబ్బం దులు పడుతున్నామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయంతీసుకున్నారు. మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇంజినీర్‌ వంటి పోస్టులకు నిర్దేశించిన అర్హతలపరంగా ప్రస్తుతం వేర్వేరు పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై ఒకే ప్రశ్నపత్రం ద్వారా పరీక్షలను నిర్వహించే విషయాన్ని ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది.

Posted on 21-08-2018