close

తాజా స‌మాచారం

గ్రూపు-1 కొత్త సిలబస్‌ ఖరారు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ఉద్యోగ నియామకాల కొత్త సిలబస్‌ ఖరారైంది. ఈ నియామకాల కొత్త ముసాయిదా సిలబస్‌ను వెబ్‌సైటులో ఉంచి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని అక్టోబ‌రు 5న‌ కమిటీ సభ్యుల ముందుంచింది. గ్రూపు-1 సిలబస్‌లో నైతిక విలువలు, న్యాయవిభాగాల్లో పలు అంశాలను స్వల్పంగా తగ్గించి ఖరారుచేసినట్లు తెలిసింది. త్వరలో వెబ్‌సైటులో సిలబస్‌ ఉంచనున్నారు. గ్రూపు-2 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ను ఒకే సిలబస్‌ ద్వారా నిర్వహించనున్నారు.

Posted on 06-10-2018