close

తాజా స‌మాచారం

గ్రూపు-1 సిలబస్‌ త్వరలో వెబ్‌సైట్‌లో

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ముసాయిదా సిలబస్‌కు, ఖరారు చేసిన సిలబస్‌కు మధ్య వ్యత్యాసం స్వల్పమేనని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. 95% వరకు ఎటువంటి తేడా లేదని పేర్కొన్నారు. నైతిక విలువలు, న్యాయపరమైన అంశాల్లో లోతైన విశ్లేషణలను స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అనుసరించి కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. సిలబస్‌ వివరాల్ని అక్టోబ‌రు 13లోగా వెబ్‌సైట్‌లో పెడతామని చెప్పారు.
గ్రూపు-1 ప్రిలిమ్స్‌ కింద రెండు పేపర్లను అభ్యర్థులు రాయాల్సి ఉంది. రెండో పేపర్లో 50% మార్కులకు గణితం నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నారు. దీంతో గణితం నేపథ్యం ఉన్నవారు మాత్రమే ప్రయోజనం పొందుతారని జనరల్‌ అభ్యర్థులు వాపోతున్నారు.

Posted on 10-10-2018