close

తాజా స‌మాచారం

అందుబాటులో గ్రూపు-1, గ్రూపు-2 పాఠ్యాంశాలు

* వెబ్‌సైట్‌లో పెట్టిన ఏపీపీఎస్‌సీ
ఈనాడు, అమరావతి: గ్రూపు-1, గ్రూపు-2 కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ ఉద్యోగాల ముసాయిదా పాఠ్యాంశాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను కమిషన్‌ స్వీకరించింది. వీటిని మరోసారి కమిటీలు పరిశీలించి స్వల్ప మార్పులు చేసి..అనంతరం ఖరారు చేసినట్లు కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌, సభ్యులు రంగ జనార్థన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు తగినట్లు అభ్యర్థుల ఎంపిక జరిగేలా కొత్త సిలబస్‌ ఉపయోగపడుతుందన్నారు. సిలబస్‌ తెలుగు అనువాదాన్ని ‘ఈనాడు’ చదువు పేజీ, ‘ఈనాడు’ ప్రతిభ.నెట్‌లో చూడొచ్చు.

Posted on 23-10-2018