తాజా స‌మాచారం

2003 గ్రూప్‌-1 విజేతలపై నేడు కొత్త జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2003 గ్రూప్‌-1 ప్రకటనను అనుసరించి అదనంగా ఎంపిక చేసిన 67 మందితో కూడిన జాబితాలో పొరబాట్లు దొర్లాయి. దీనిపై అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్‌సీకి ఫిర్యాదులు, విజ్ఞప్తులు వెళ్లాయి. సాంకేతికపరమైన అంశాల వల్ల జాబితా రూపకల్పనలో పొరపాట్లు దొర్లాయని, వాటిని సరిచేస్తున్నామని ఏపీపీఎస్‌ వర్గాలు వెల్లడించాయి. జులై 21న కొత్త జాబితాను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో పెడతామని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి.
http://psc.ap.gov.in/

Posted on 21-07-2016