తాజా స‌మాచారం

గ్రూపు-1 (2011) మెయిన్స్ అభ్యర్థుల జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్: గ్రూపు-1 (2011) నోటిఫికేషన్ అనుసరించి గతంలో ప్రధాన పరీక్షల రాసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మళ్లీ ప్రధాన పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి 8760 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, వరంగల్ కేంద్రాల ప్రకారం ఈ జాబితాలు వెలువడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా 4701 మంది, వైజాగ్ నుంచి 1342 మంది, మిగిలిన వారు తిరుపతి, విజయవాడ, వరంగల్ కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. గతంలో 8564 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షలు రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ప్రిలిమ్స్‌లో దొర్లిన తప్పులను సరిదిద్ది మళ్లీ మూల్యాంకనం చేయగా 196 మంది అదనంగా అర్హత సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం మీద 8760 మందికి ప్రధాన పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు.

Posted on 30-07-2016