close

తాజా స‌మాచారం

గ్రూప్‌-1 పరీక్ష కేంద్రాల మార్పు

ఈనాడు, హైదరాబాద్‌: అభ్యర్థులు తక్కువగా ఉన్నందున సెప్టెంబరు 21, 23, 24 తేదీల్లో జరుగనున్న గ్రూప్‌-1 పరీక్ష కేంద్రాల సంఖ్యను కుదించి, మార్పులు చేశామని ఏపీపీఎస్‌సీ కార్యదర్శి సెప్టెంబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జారీచేసిన హాల్‌టికెట్లతో అభ్యర్థులు కొత్త పరీక్షకేంద్రాల్లో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
మార్పుల వివరాలు...: ప్రస్తుతం ‘‘అశోక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(కోడ్‌: 80102), చౌటుప్పల్‌; వివేకానంద గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(కోడ్‌: 80103), హయత్‌నగర్‌ మండలం; ఏఎల్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల(కోడ్‌: 80109), నాదర్‌గుల్‌ గ్రామం; ఎంఆర్‌ఎం గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(కోడ్‌: 80110), ఇబ్రహీంపట్నం మండలం’’ పరీక్ష కేంద్రాలుగా ఉన్న అభ్యర్థులకు మార్పుల తర్వాత ‘‘అరబిందో కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(కోడ్‌:80106), షెరిగూడ, చింతపల్లాయగూడ, గ్రామం, సాగర్‌ రోడ్డు, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌’’ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు.
‘‘ఆర్‌ఆర్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(కోడ్‌: 80104), పటాన్‌చెరు మండలం’’ పరీక్ష కేంద్రంగా ఉన్న అభ్యర్థులకు మార్పుల అనంతరం ‘‘టర్బోమెషినరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌(కోడ్‌: 80101), ఇంద్రేశం(గ్రామం), ఆర్టీవో కార్యాలయం వద్ద, పటాన్‌చెరు మండలం’’ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు.
తొమ్మిది గంటల్లోపు గేటు వద్ద ఉండాలి: సెప్టెంబరు 14, 17, 19 తేదీల్లో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలకు సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నా కొందరు అభ్యర్థులను లోపలకు అనుమతించలేదనే మీడియా కథనాల్లో నిజం లేదని ఏపీపీఎస్‌సీ కార్యదర్శి స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 8:30 నుంచి ఉదయం 9 గంటల్లోపు పరీక్ష కేంద్రం గేటు వద్ద ఉండాలని సూచించారు. తొమ్మిది దాటిన తర్వాత వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ‘సుపరిపాలన కేంద్రం(సీజీజీ)’ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తోందని చెప్పారు. ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

Posted on 20-09-2016