తాజా స‌మాచారం

గ్రూపు-2 (1999) మౌఖిక పరీక్షకు స్పందన నామమాత్రం

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 (1999) మౌఖిక పరీక్షకు అభ్యర్థుల నుంచి స్పందన తక్కువగా ఉంది. వివాదాస్పద 1999 నోటిఫికేషన్‌ అనుసరించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 54 మంది అభ్యర్థులకు బుధ, గురువారాల్లో మౌఖిక పరీక్షలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. అక్టోబరు 19న 27 మంది హాజరుకావాలని కోరగా కేవలం ఏడుగురే హాజరయ్యారు. వీరిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు. 1999 నోటిఫికేషన్‌ కావడం, ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థిరపడి ఉండడంతో అభ్యర్థుల నుంచి స్పందన తక్కువగా ఉంది.

Posted on 20-10-2016