close

తాజా స‌మాచారం

త్వరలో 1999 గ్రూప్ 2 పోస్టుల భర్తీ

హైదరాబాద్‌: గ్రూప్‌-2 సర్వీసెస్‌ 10/1999 ప్రకటనకు సంబంధించి... మూడు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, అప్పటి జీవోల ప్రకారం ప్రక్రియ చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా.. మొత్తం మీద 1084 పోస్టుల భర్తీకి వీలుగా తొలుత రివైజ్డ్‌ జనరల్‌ మెరిట్‌ లిస్టును రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 973 పోస్టులను గతంలోనే భర్తీ చేయగా... ఇప్పుడు 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు ఉంటుందన్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటంతోపాటు పలు కారణాల వల్ల ఈ రిక్రూట్‌మెంట్‌ ఇంత వరకూ పూర్తి కానందున తుది ఎంపిక ప్రక్రియలో రూల్‌-7ను వర్తింపజేస్తామని ఉదయ భాస్కర్‌ వెల్లడించారు.

Posted on 11-11-2016