తాజా స‌మాచారం

'ఆ పోస్టులకు నైపుణ్య పరీక్ష లేదు'

హైదరాబాద్: ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్ 2 ప్రకటనలోని కొన్ని పోస్టులకు ప్రొఫిసియెన్సీ టెస్టును మినహాయించింది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటనలో కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేసింది. ఆయా పోస్టుల వివరాల్ని అందులో పొందుపరిచింది. అయితే ఆ జాబితాలో కొన్ని ఇతర పోస్టులు పొరపాటున చేరాయి. పోస్టు కోడ్ నంబర్ 8, 13, 33, 34 పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదని, వాటిని ప్రొఫిషియన్సీ టెస్టునుంచి మినహాయిస్తున్నామని సవరణ ప్రకటన జారీ చేసింది. పోస్టు కోడ్ నంబర్లు 9, 10, 11, 12, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 పోస్టులకు మాత్రమే ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.

Posted on 11-11-2016