తాజా స‌మాచారం

ప‌ర్యావ‌ర‌ణ పోస్టుల‌కు ప్రిలిమ్స్ లేనట్లే

హైద‌రాబాద్: అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్విరానిమెంట‌ల్‌) పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఒకే దశ రాత‌ప‌రీక్ష (మెయిన్) ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ప్రభుత్వం ఇదివ‌ర‌కే విడుద‌ల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. 25,000 కంటే త‌క్కువ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన పోస్టుల భ‌ర్తీకి ప్రిలిమ్స్ ప‌రీక్ష ఉండ‌ద‌ని క‌మిష‌న్ ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రజారోగ్యం, మునిసిప‌ల్ ఇంజినీరింగ్ శాఖ‌లోని ప‌ర్యావ‌ర‌ణ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి త‌క్కువ సంఖ్యలో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన నేప‌థ్యంలో... వీటికి ప్రిలిమ్స్ ఉండ‌ద‌ని కమిషన్ ప్రక‌టించింది. ప్రక‌ట‌న‌లో పేర్కొన్న షెడ్యూలు ప్రకారం ఈ ప‌రీక్షను 2017 ఫిబ్రవ‌రి 2న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామ‌ని స్పష్టం చేసింది.

Posted on 11-11-2016