తాజా స‌మాచారం

ఎక్సైజ్ ఎస్సై వయోపరిమితి 28 నుంచి 30

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ఎక్సైజ్ ఎస్సై పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిని పెంచింది. తాజాగా దీన్ని 28 ఏళ్ల నుంచి 30 కి సవరించినట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. క‌మిష‌న్‌ న‌వంబ‌రు 8న గ్రూప్ 2 ప్రక‌ట‌న (18/2016)ను జారీ చేసింది. ఇందులో ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ స‌బ్ ఇన్‌స్పెక్టర్ (ఎనిమిదో నెంబ‌ర్‌ పోస్ట్ కోడ్) పోస్టుల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిని 28 నుంచి 30 ఏళ్లకు పెంచింది.

Posted on 15-11-2016