తాజా స‌మాచారం

2011 గ్రూప్‌-1 అయిదో పేపర్ మళ్లీ నిర్వహణ!

హైదరాబాద్: 2011 గ్రూప్ 1 ప్రకటన (18/ 2011) కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో అయిదో పేపర్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2012లో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసి ఇరు రాష్ట్రాలు విడివిడిగా మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాయి. ఏపీపీఎస్సీ ఈ ఏడాది సెప్టెంబరు 13న మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించింది. అయిదో పేపర్ పరీక్షకు దాదాపు మూడు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Posted on 18-11-2016