తాజా స‌మాచారం

ఏఈఈ మెయిన్స్‌కు 37,400 మంది అర్హత

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) స్కీన్రింగ్‌ టెస్ట్‌ ఫలితాలు సిద్ధమయ్యాయి. కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టేందుకు డిసెంబరు 2వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన పరీక్షకు 37,400 మంది అర్హత సాధించారు. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షకు కట్‌ఆఫ్‌ మార్కులు 49గా నిర్ణయించారు. 801 మంది జవాబుపత్రాలను మూల్యాంకనం చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులు వ్యవహరించినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి తెలిపారు. డిసెంబరు నెలాఖరులో ప్రధాన పరీక్ష జరుగుతుందని, ఈ పరీక్ష హాల్‌టికెట్లను త్వరలో వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు వెల్లడించారు.
APPSC AEE Screening Test Results

Posted on 03-12-2016