తాజా స‌మాచారం

నెలాఖరుకు 20 ప్రకటనలు: ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) డిసెంబరు నెలాఖరులోగా మరిన్ని ప్రకటనలను విడుదల చేయనుంది. గ్రూప్‌– 1, గ్రూప్‌– 3 పోస్టులతో పాటు మరికొన్ని ఇతర పోస్టులకు కూడా నోటిఫికేషన్లు వెలువరించనుంది. మొత్తం 20 నోటిఫికేషన్లలో 2,000 పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
త్వరలో జారీ చేయనున్న ప్రకటనలు, పోస్టులు
గ్రూప్‌ 3 - 1,055 పంచాయతీ కార్యదర్శులు
గ్రూప్‌ 1 - 94 పోస్టులు
డిగ్రీ లెక్చరర్లు - 504
డిప్యూటీ సర్వేయర్లు - 259
హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు - 100
స్పెషల్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు - 77
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు - 49
మెడికల్‌ ఆఫీసర్లు - 53

Posted on 21-12-2016