తాజా స‌మాచారం

ఈసారి 611 ఉద్యోగాలు

* ఐదు ఉద్యోగ భర్తీ ప్రకటనలు జారీ చేసిన ఏపీపీఎస్సీ
* డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులే 504
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో అయిదు ఉద్యోగ భర్తీ ప్రకటనల్ని డిసెంబరు 28న జారీచేసింది. వీటి ద్వారా 611 ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ డిసెంబరు 29 నుంచి మొదలవుతుంది. జనవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే వారి అర్హత, ఇతర పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పెట్టబోతున్నారు. ఏపీపీఎస్సీ డిసెంబరు 24వ తేదీన ఆరు ఉద్యోగ ప్రకటనల్ని జారీచేసింది. అంతకుముందే గ్రూపు-2 , ఇతర ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. మిగిలిన గ్రూపు-1, 3, ఇతర పోస్టుల భర్తీ ప్రకటనలు కూడా త్వరలోనే రాబోతున్నాయి.
స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రధాన పరీక్షకు ప్రస్తుతం 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. అలాకాకుండా సామాజిక వర్గాల వారీగా 1:12 లేదా 1:15 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థుల్ని ఎంపికచేసేందుకు అనుమతిని కోరుతూ ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో అభ్యర్థుల వయో పరిమితిని దృష్టిలో ఉంచుకుని మిగిలిన అన్నిరకాల ప్రకటనలను డిసెంబరు నెలాఖరులోగా జారీచేసేస్తామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు.
పోస్టుల వివరాలు, పరీక్షల తేదీలు
1) క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు - 2 (నెల్లూరు మెడికల్ కాలేజీ) - పరీక్ష తేదీ : 04.04.2017
2) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు - 504 (కళాశాల విద్య) - పరీక్ష తేదీ - 06.06.2017
3) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు - 95 (ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్)- స్క్రీనింగ్ టెస్ట్-09.07.2017, ప్రధాన పరీక్ష - 13.10.2017
4) అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్) పరీక్ష - 14.06.2017
5) అసిస్టెంట్ కెమిస్ట్ (భూగర్బ నీటి శాఖ) 04.04.2017, 05.04.2017
* ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 18 రకాల సబ్జెక్టుల్లో కలిపి 504 పోస్టుల్ని భర్తీచేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే దరఖాస్తులు తక్కువగా వస్తాయి. అందువల్ల స్క్రీనింగ్, ప్రధాన పరీక్షల్ని వేర్వేరుగా కాకుండా ఒకే పరీక్షను నిర్వహిస్తే సరిపోతుందని ఏపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి.
క్లినికల్ సైకాలజిస్ట్ (నెల్లూరు మెడికల్ కాలేజీ)
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు (కళాశాల విద్య)
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు (ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్)
అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్)
అసిస్టెంట్ కెమిస్ట్ (భూగర్బ నీటి శాఖ)
Website

Posted on 29-12-2016