close

తాజా స‌మాచారం

గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్లు జారీచేసిన ఏపీపీఎస్సీ

విజయవాడ: 2017 కొత్త సంవత్సరం సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త అందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) మరో 10 నోటిఫికేషన్లు జారీచేసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-3 పోస్టుల భర్తీతో పాటు ఇతర చిన్న చిన్న పోస్టులకు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ శనివారం (డిసెంబరు 31) జారీచేశారు. గ్రూప్‌-1 కింద 78 పోస్టులు, గ్రూప్‌-3 కింద 1055 పంచాయతీరాజ్‌ కార్యదర్శి పోస్టులు భర్తీ చేయనున్నారు. పరీక్ష తేదీలను తాత్కాలికంగా వెల్లడించినా.. 2017లో వివిధ పోటీ పరీక్షల దృష్ట్యా మార్పులు చేసే వీలుందని ఛైర్మన్‌ తెలిపారు. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్ష మినహా మిగిలిన అన్ని ఆబ్జెక్టివ్‌ పరీక్షలకు నెగిటివ్‌ మార్కులు ఉంటాయని వివరించారు. నోటీఫికేషన్‌ వివరాలను ఈరోజు (డిసెంబరు 31) రాత్రి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వెల్లడించారు.
Website

Posted on 31-12-2016