తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ నుంచి 9 నోటిఫికేష‌న్లు

* గ్రూప్‌-1లో 78 పోస్టులు
* మే 7న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష

ఈనాడు, హైద‌రాబాద్‌: ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు కొత్త సంవ‌త్సరంలో తీపి క‌బురు అందించింది. డిసెంబ‌రు 31 (శ‌నివారం) 9 కొత్త నోటిఫికేష‌న్లను విడుద‌ల‌చేసింది. వీటిలో గ్రూప్‌-1 కు సంబంధించి 78 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డెప్యూటీ క‌లెక్టర్లు 5, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్లు 13, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 6, డీఎస్పీ 24, అసిస్టెంట్ ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ 10, బీసీ వెల్ఫేర్ ఆఫీస‌ర్ 2, గ్రేడ్ 2 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ 8, అసిస్టెంట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ 10 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి పోటప‌డ‌వ‌చ్చు. మే 7న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వహించ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. ఆగ‌స్టు 17 నుంచి 27 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్షలు ఉంటాయి.

ఇత‌ర నోటిఫికేష‌న్లు...
గ్రేడ్‌-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్లు మొత్తం పోస్టులు వంద ఉన్నాయి. వీటిలో 51 మ‌హిళ‌ల‌కు 49 పురుషుల‌కు కేటాయించారు. జూన్ 11న స్క్రీనింగ్ టెస్టు, సెప్టెంబ‌రు 21న మెయిన్స్ నిర్వహిస్తారు. ఈ పోస్టుల‌కు డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసిన‌వాళ్లే అర్హులు
Click here
మైనింగ్ స‌ర్వీస్‌లో రాయాల్టీ ఇన్‌స్పెక్టర్ 5 పోస్టులు ఉన్నాయి.
Click here
అసిస్టెంట్ బీసీ, సోష‌ల్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్లు 29 పోస్టులు ఉన్నాయి. వీటికి జూన్ 18న స్క్రీనింగ్ టెస్టు, సెప్టెంబ‌రు 21, 22 తేదీల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.
Click here
అగ్రిక‌ల్చర్ ఆఫీస‌ర్లు 30 పోస్టులు ఉన్నాయి. ఎజీబీఎస్సీ పూర్తిచేసిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు పోటీ ప‌డ‌వ‌చ్చు.
Click here
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 5 ఖాళీలు ఉన్నాయి.
Click here
అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో 5 రాష్ట్రస్థాయి పోస్టులు భ‌ర్తీ చేస్తారు.
Click here
అసిస్టెంట్ డైరెక్టర్ ఫిష‌రీస్ స‌ర్వీసెస్‌లో 10 పోస్టులు ప్రక‌టించారు.
Click here

Website

Posted on 31-12-2016