close

తాజా స‌మాచారం

78 గ్రూప్ 1 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రకటన

* మే 7న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష
* ఆగస్టులో మెయిన్స్
ఈనాడు, హైద‌రాబాద్‌: ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు కొత్త సంవ‌త్సరంలో తీపి క‌బురు అందించింది. డిసెంబ‌రు 31న 8 కొత్త నోటిఫికేష‌న్లను విడుద‌ల‌ చేసింది. వీటిలో గ్రూప్‌-1 కు సంబంధించి 78 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డిప్యూటీ క‌లెక్టర్లు 5, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్లు 13, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 6, డీఎస్పీ 24, అసిస్టెంట్ ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ 10, బీసీ వెల్ఫేర్ ఆఫీస‌ర్ 2, గ్రేడ్ 2 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ 8, అసిస్టెంట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ 10 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి పోటీ ప‌డ‌వ‌చ్చు. మే 7న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వహించ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. ఆగ‌స్టు 17 నుంచి 27 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్షలు ఉంటాయి.
పోస్టుల వివరాలు......
1) డిప్యూటీ కలెక్టర్: 05
2) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్: 13
3) డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్: 06
4) డిప్యూటీ సూప‌రెంటెండెంట్ ఆఫ్ పోలీస్‌ (డీఎస్పీ): 24
5) అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూప‌రెంటెండెంట్: 10
6) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 02
7) మునిసిపల్ కమిషనర్ (గ్రేడ్ 2): 08
8) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్: 10
అర్హత: ఏదైనా డిగ్రీ. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోస్టుకు లా లేదా సోషల్ వర్కులో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
గరిష్ఠ వయోపరిమితి: ఎక్సైజ్ సూప‌రెంటెండెంట్ పోస్టుకు 28 ఏళ్లు, డీఎస్పీ పోస్టుకు 30 ఏళ్లు, మిగిలిన అన్ని పోస్టులకు 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఎంపిక: ప్రిలిమనరీ, మెయిన్ టెస్ట్ ద్వారా
ప్రిలిమనరీ రాతపరీక్ష: 07.05.2017
మెయిన్ రాతపరీక్ష: 17.08.2017 నుంచి 27.08.2017 వరకు
దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 31.12.2016 నుంచి 30.01.2017 వరకు

Notification
Online Application
Website

Posted on 31-12-2016