close

తాజా స‌మాచారం

1055 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రకటన

ఈనాడు, హైద‌రాబాద్‌: ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు కొత్త సంవ‌త్సరంలో తీపి క‌బురు అందించింది. డిసెంబ‌రు 31న 8 కొత్త నోటిఫికేష‌న్లను విడుద‌ల‌ చేసింది. వీటిలో 1055 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను జిల్లాల వారీగా స్థానిక, స్థానికేతర కోటాలో భర్తీ చేయనున్నారు. జిల్లాలవారీగా చూస్తే చిత్తూరు జిల్లాకు అత్యధికంగా 119 పోస్టులు, ప్రకాశం జిల్లాకు అత్యల్పంగా 43 పోస్టులు వచ్చాయి. కమిషన్ ముందే పేర్కొన్నట్లు ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దఫాలుగా నిర్వహించనుంది. రుణాత్మక మార్కుల విధానాన్ని కూడా ప్రవేశపెట్టనుంది. అభ్యర్థులు ఏ జిల్లాకు దరఖాస్తు చేసుకుంటే ఆ జిల్లాలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. డిసెంబరు 31 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కమిషన్ అవకాశం కల్పించింది. పరీక్ష ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు తుది గడువు జనవరి 30.
పోస్టుల వివరాలు......
* పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 4)
పోస్టుల సంఖ్య: 1055
అర్హత: ఏదైనా డిగ్రీ.
వయోపరిమితి: 18-42 ఏళ్లు.
ఎంపిక: ఎంపిక: ప్రిలిమనరీ, మెయిన్ టెస్ట్ ద్వారా
ప్రిలిమనరీ రాతపరీక్ష: 23.04.2017
మెయిన్ రాతపరీక్ష: 16.07.2017
దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 31.12.2016 నుంచి 30.01.2017 వరకు

Notification
Online Application
Website

Posted on 31-12-2016