తాజా స‌మాచారం

ఉప సర్వేయర్‌ ఉద్యోగాలకు బీటెక్‌ చేసినవారు అర్హులే

* పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసినవారు కూడా..
ఈనాడు, అమరావతి: ఉప సర్వేయర్‌ పోస్టుల అర్హతల్లో మార్పు జరిగింది. 259 ఉప సర్వేయర్‌ పోస్టుల భర్తీకి ఇంతకుముందు ప్రకటన ఇచ్చిన ఏపీపీఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ వృత్తివిద్య కోర్సు చేసినవారు వీటికి అర్హులని చెప్పింది. తమకూ అర్హత కల్పించాలని బీటెక్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసినవారు ప్రభుత్వాన్ని కోరారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన సర్వేశాఖ బీటెక్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసినవారు కూడా ఈ పోస్టులకు అర్హులేనని చెబుతూ ఏపీపీఎస్‌సీకి లేఖ పంపింది. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.

Posted on 18-01-2017