తాజా స‌మాచారం

ఇక రాతపూర్వకంగానే అభ్యంతరాల స్వీకరణ

* అభ్యర్థుల అనూహ్య స్పందనతో నిర్ణయం మార్చుకున్న ఏపీపీఎస్సీ
ఈనాడు, అమరావతి: అభ్యర్థుల విపరీత స్పందనతో ఏపీపీఎస్సీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రశ్నపత్రాల ‘కీ’లపై ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా రాతపూర్వకంగా మాత్రమే అభ్యంతరాల్ని స్వీకరించాలని నిర్ణయించింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాల ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల ‘కీ’లపై... ముందుగా నిర్ణయించినట్టు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాల్ని స్వీకరించింది. 11వేల వరకు అభ్యంతరాలు రావడంతో వీటిని పరిశీలించేందుకు ఆయా సబ్జెక్టుల్ని అనుసరించి ఎక్కువ సంఖ్యలో కమిటీల్ని వేయాల్సి వచ్చింది. దీనివల్ల జనవరి నెలాఖరులో ఇవ్వాలనుకున్న ఫలితాల్ని ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఇవ్వలేకపోయింది. అభ్యంతరాలను రాతపూర్వకంగా స్వీకరిస్తామని, దీనివల్ల విశ్వసనీయత కలిగినవి వస్తాయని ఆశిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి తెలిపారు.

Posted on 03-02-2017