తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల జారీ చేసిన కొన్ని ప్రకటనల పరీక్ష తేదీలను మార్పు చేసింది. టెక్నికల్‌ అసిస్టెంట్ (మైనింగ్‌) పోస్టుల పరీక్షను మార్చి 2కు బదులు 3న నిర్వహిస్తారు. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్) పోస్టు పరీక్ష యథాతథంగా మార్చి 3న ఉంటుంది. ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుకు 3 పేపర్ల పరీక్షను మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తామని ఇదివరకు ప్రకటించగా మార్చి 4, 5 తేదీల్లోకి మార్పు చేశారు. అలాగే సివిల్‌ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టుల పరీక్షను మార్చి 3కు బదులు మార్చి 4న నిర్వహిస్తారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టు పరీక్షను మార్చి 3కు బదులు 4న నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ఆర్కిటెక్చర్, సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు మార్చి 3కు బదులు మార్చి 5న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఫిబ్రవరి 16న ఒక ప్రకటన విడుదల చేశారు.
https://www.psc.ap.gov.in/

Posted on 17-02-2017