తాజా స‌మాచారం

గ్రూపు 2 పరీక్షకు జిల్లాలవారీగా పర్యవేక్షణ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ గ్రూపు-2 పరీక్షలకు సంబంధించి ప్రతి జిల్లాకు పర్యవేక్షణ (లైజనింగ్‌) అధికారులను నియమించినట్లు ఛైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. అభ్యర్థులకు సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. ఆయా అధికారుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని వివరించారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 23న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26న జరిగే గ్రూపు-2 స్క్రీనింగ్‌ పరీక్షకు ఉదయం తొమ్మిదింటి నుంచి 9.45 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పదింటికి పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 6.57 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇప్పటివరకు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు.

Posted on 24-02-2017