తాజా స‌మాచారం

20 రోజుల్లో గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు

* ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్
వేమూరు, న్యూస్‌టుడే: గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను 20 రోజుల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ఆదివారం(మార్చి 5) గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని స్వగ్రామం వెల్లబాడుకు వచ్చిన ఆయన 'ఈటీవీ'తో మాట్లాడారు. మే నెల 20, 21 తేదీల్లో గ్రూప్-2 మెయిన్ పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. గడచిన ఆరు నెలల్లో ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్‌లు విడుదల చేశామని, వాటి ద్వారా 4,275 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని పేర్కొన్నారు.

Posted on 06-03-2017