తాజా స‌మాచారం

ఇకపై మెయిన్స్‌కు కేటగిరీల వారీగా కటాఫ్‌!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భవిష్యత్తులో విడుదల చేసే ప్రకటనలకు సంబంధించి.... స్క్రీనింగ్‌ టెస్టులో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులతో మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త ప్రకటలకు ఈ విధానం వర్తింపజేయనున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే కటాఫ్‌ మార్కులు ఎన్ని? ఏ నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలి? అనేది ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే వెలువడిన 2016 గ్రూప్‌ 2కు కానీ, ఇతర నోటిఫికేషన్ల ప్రిలిమ్స్‌ పరీక్షలకు వర్తించదని ఏపీపీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Posted on 09-03-2017